హీరో నాగార్జున ఆ విషయం బయటపెట్టేసాడు… రెండు దశాబ్దాలుగా ఆమెతో సంబంధం ఉందట?

టాలీవుడ్ మన్మధుడు హీరో నాగార్జున గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. బక్కపలచని శరీరంతో పీలగా వున్న ఓ హీరో తరువాతి కాలంలో తెలుగు తెరపై మన్మధుడి అవతారం ఎత్తాడు. ఇప్పటికీ తెలుగు మహిళలు నాగార్జున అంటే పడి చస్తారు. ఇకపోతే నాగార్జున హీరోయిన్ టబు గురించి కూడా అందరికీ తెలిసినదే. వీరి కాంబినేషన్లో మంచి రొమాంటిక్ ఫిలిమ్స్ వచ్చాయి. ఈ క్రమంలో వీరిమధ్య మంచి స్నేహబంధం కూడా ఏర్పడింది. దాంతో వీరి మధ్య ఏదో రిలేషన్ ఉందని అప్పట్లోనే ఎన్నో కధనాలు నడిచేవి.

1998లో ‘ఆవిడ మా ఆవిడ’ అనే సినిమా వీరి కాంబినేషన్లో రాగా అది సూపర్ హిట్ అయింది. అయితే ‘నిన్నే పెళ్ళాడుతా’ సినిమా మాత్రం వీరి కెరీర్లో పెద్ద మైలురాయి అని చెప్పుకోవాలి. ఆ టైంలో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ఉండడం వల్లో లేక మరేమో గాని నాగార్జున టబు మద్య ఏదో రిలేషన్ ఉంది అని అప్పటినుండి ఇప్పటివరకు రూమర్లు వస్తున్నాయి. అంతేకాదు వీరిద్దరూ చాలాకాలంపాటు రిలేషన్ లో కూడా ఉన్నారని ఇండస్ట్రీలో ఎన్నో గుసగుసలు వినిపించాయి. అయితే నాగార్జున ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ రూమర్లన్నింటినికీ చెక్ పెట్టాడు.

టబు కి మీకు మధ్య ఎలాంటి రిలేషన్ ఉంది? అని సదరు విలేఖరి ప్రశ్నించగా.. నాగార్జున ఆ రిలేషన్ పై మాట్లాడుతూ… “టబు నాకు ఓ అందమైన ఫ్రెండ్. మా ఇద్దరి మధ్య స్నేహబంధానికి దాదాపు 21-22 ఏళ్ళు. మా ఇద్దరి మధ్య ఈ రిలేషన్ టబు కి పదహారేళ్ళ వయసు ఉన్నప్పటి నుండే కొనసాగుతోంది. అంటే మా జీవితంలో సగం కాలం మేము స్నేహితులుగానే ఉన్నాం. మా స్నేహ బంధం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అందులో నేను స్పెషల్ గా దాచడానికి ఏమీ లేదు. మీరు నా ముందు టబు పేరు పలికారు అంటే నా మొహంలో ఏదో తెలియని ఉత్సాహం వెలిగిపోతూ ఉంటుంది. కానీ మీరు దాన్ని వేరే అనుకుంటారు. అది కరెక్ట్ కాదు!” అని నవ్వుతూ సమాధానం ఇచ్చారు.

Share post:

Latest