బేబమ్మ సినిమాలు ఎక్కడ తేడా కొడుతున్నాయి? మెగా కాంపౌండ్ మళ్ళీ అవకాశం ఇస్తుందా?

బేబమ్మ అంటే ఎవరో చెప్పాల్సిన పనిలేదు. అవును… మొదటి సినిమా ‘ఉప్పెన’ తోనే వర్ధమాన తార కృతి శెట్టి.. తెలుగులో వరుస సినిమా అవకాశాలను అందిపుచ్చుకుంది. ఉప్పెన సూపర్ డూపర్ హిట్ అవ్వడం కూడా అమ్మడుకి బాగా కలిసొచ్చింది. మెగా కాంపౌండ్ నుండి వచ్చిన ‘వైష్ణవ్ తేజ్’ తొలి సినిమా కూడా ఇదే కావడం యాదృచ్చికం. మొత్తానికి ఏదైతేనేం… అమ్మడుకి మెగా ఫ్యామిలీ సపోర్టు కూడా తోడయ్యింది. అయితే వరుసగా మూడు హిట్స్‌తో హాట్రిక్ హిట్స్ నమోదు చేసిన ఈ భామ.. ‘ది వారియర్’ మూవీతో తొలి ఫ్లాప్‌ను అందుకుంది.

అలాగే తాజాగా నితిన్ హీరోగా నటించిన ‘మాచర్ల నియోజకవర్గం’ మూవీతో మరో ఫ్లాప్‌ రావడంతో అప్పుడే బేబమ్మ పైన అనుమానాలు పుట్టిస్తున్నారు. కృతి శెట్టికి బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయిందా? అంటూ ఆరాలు తీసి.. పేరాలు పేరాలు రాసేస్తున్నారు. ఈమె నటించిన రెండు సినిమాలు ‘ది వారియర్’, ‘మాచర్ల నియోజకవర్గం’ నెల రోజుల గ్యాప్‌లో విడుదలై డిజాస్టర్ టాక్ సొంతం చేసుకున్న సంగతి విదితమే. అయితే ఆ రెండు సినిమాలు ఆమె సినిమా జీవితాన్ని డిసైడ్ చేస్తాయి అనుకోవడం మూర్ఖత్వం అవుతుంది. మొత్తంగా హాట్రిక్ లక్కీ గర్ల్‌గా పేరు తెచ్చుకున్న బేబమ్మకి ఈ ఫ్లాపులు దిష్టి చుక్క వంటివి.

ఇకపోతే టేలెంటెడ్ డైరెక్టర్ ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా తెరకెక్కిస్తోన్న ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమా త్వరలో రాబోతోంది. ఇందులో కృతి లీడ్ చేసింది. ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందనే ఆశతో కృతి వుంది. అలాగే మరోవైపు తమిళ సినిమా అవకాశాలు కూడా అమ్మడిని వెతుక్కుంటూ వస్తున్నాయి. సినీ ఇండస్ట్రీలో ఒక్కో సీజన్‌లో ఒక్కో హీరోయిన్ హవా నడుస్తూ ఉంటోంది. అలా టాలీవుడ్‌లో పూజా హెగ్డే, రష్మిక, రాశి ఖన్నాల తర్వాత టాలీవుడ్ టాప్ కథానాయిక లీగ్‌లో కృతి శెట్టి కూడా చేరింది. ఇంకో విషయం ఏమంటే మరలా మెగా కాంపౌండ్ నుండి అమ్మడుకి కాల్ వచ్చిందని టాక్.

Share post:

Latest