బాలయ్య అన్ స్టాపబుల్-2కి అదే పెద్ద అడ్డు..

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేసిన షో అన్ స్టాపబుల్.. ఈ షో ఎంత పెద్ద హిట్ అయ్యింది. బాలయ్యలోని డిఫరెంట్ యాంగిల్ ని పరిచయం చేసింది. ఆహా ఓటీటీలో ప్రసారమైన అన్ స్టాపబుల్ షోతో బాలయ్య విమర్శకుల నోళ్లు మూయించారు. బాలయ్య హోస్ట్ గా చేస్తే ఈ షో సక్సెస్ కాదని చాలా మంది భావించారు.. కానీ అంచనాలన్నీ తలకిందులు చేశారు బాలయ్య. ఫార్మాట్ కి భిన్నంగా వివాదాలు ప్రస్తావిస్తూ టాప్ సెలెబ్రిటీస్ లతో సాగిన ప్రతి ఎపిసోడ్ సక్సెస్ అయ్యింది. ఈ షో బంపర్ సక్సెస్ అయ్యింది.. ఈక్రమంలో అన్ స్టాపబుల్ సీజన్ 2 వచ్చేస్తుందని నిర్వాహకులు హింట్ ఇచ్చారు..

ఈనేపథ్యంలో అన్ స్టాపబుల్ సీజన్ 2 కోసం ప్రేక్షకులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. కొన్ని నెలల క్రితం ఆహా వాళ్లు సీజన్ 2 వచ్చేస్తుందని ప్రోమోలు కూడా విడుదల చేశారు. అన్ స్టాపబుల్ సీజన్ 2 పనులు స్టార్ట్ అయినట్లు ప్రకటించారు. అన్ని అనుకున్నట్లు జరిగితే ఆగస్ట్ చివరివారంలో లేదా సెప్టెంబరులో ఈ షో రావాల్సి ఉంది. కానీ, ప్రస్తుతం దీని గురించి ఎలాంటి అప్ డేట్ లేదు. టాలీవుడ్ నిర్మాత బంద్ అన్ స్టాపబుల్ షోకు పెద్ద అడ్డంకిగా మారిందని టాక్..

బాలయ్య ప్రస్తుతం తన 107వ చిత్ర షూటింగ్ లో బిజీగా ఉన్నారు. దర్శకుడు గోపిచంద్ మలినేని తెరకెక్కిస్తుండగా.. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా పూర్తయిన తర్వాతే అన్ స్టాపబుల్ సీజన్ 2 మొదలు పెట్టాలని భావిస్తున్నారట.. ఈ సినిమా షూటింగ్ ముగింపు దశలో ఉంది. అయితే టాలీవుడ్ నిర్మాత బంద్ వల్ల సినిమా షూటింగ్స్ జరగలేదు. సెప్టెంబర్ 1 నుంచి షూటింగ్స్ స్టార్ట్ చేసేందుకు నిర్మాతలు రెడీ అవుతున్నారు. ఈ సినిమా షూటింగ్ అయిపోతే.. అక్టోబరులో బాలయ్య అన్ స్టాపబుల్ షోను స్టార్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి.

Share post:

Latest