సత్తెనపల్లి నాదే అంటున్న శివరాం.!

కోడెల శివప్రసాద్ చనిపోయిన దగ్గర నుంచి సత్తెనపల్లి సీటు విషయంలో చంద్రబాబు ఇంకా క్లారిటీ ఇవ్వలేదనే సంగతి తెలిసిందే. 2009 వరకు నరసారావుపేట అసెంబ్లీలో సత్తా చాటిన కోడెల…2014లో పొత్తులో భాగంగా పేట సీటు..బీజేపీకి వెళ్ళడంతో కోడెల…సత్తెనపల్లి సీటు లోకి వచ్చారు. 2014 ఎన్నికల్లో తక్కువ మెజారిటీతో అక్కడ గెలిచారు. ఇక 2019 ఎన్నికల్లో కోడెల…అంబటి రాంబాబు చేతిలో ఓటమి పాలయ్యారు. తర్వాత పలు కారణాల వల్ల కోడెల ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.

అయితే కోడెల చనిపోయాక…సత్తెనపల్లి సీటు ఆయన కుమారుడు కోడెల శివరాంకు కేటాయిస్తారని అంతా అనుకున్నారు. కానీ కోడెల కుమారుడుకు సీటు ఇవ్వొద్దని సత్తెనపల్లిలోని కొందరు టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. దీంతో సీటు విషయాన్ని బాబు పెండింగ్ లో పెట్టారు. ఇదే క్రమంలో ఈ సీటులో ఆశావాహుల సంఖ్య పెరుగుతూ వస్తుంది…అయినా సరే బాబు ఇంకా సీటు ఫిక్స్ చేయడం లేదు.

ఇప్పటికే సత్తెనపల్లిలో గ్రూపు రాజకీయాలు పెరిగిపోయాయి…ఇటు శివరాం సెపరేట్ గా రాజకీయం చేసుకుంటూ వచ్చేస్తున్నారు. కానీ శివరాంకు అఫిషయల్ గా సీటు ఫిక్స్ చేయడం లేదు. అయినా సరే శివరాం ఎక్కడా తగ్గడం లేదు..వ్యతిరేక వర్గం ఎంత రాజకీయం చేసిన…తనదైన శైలిలో సత్తెనపల్లిలో పనిచేసుకుంటూ వెళుతున్నారు. అయితే ఇప్పటివరకు సీటు విషయంలో ఏ మాత్రం క్లారిటీ ఇవ్వని శివరాం..తాజా సత్తెనపల్లి సీటు తనదే అని దూకుడు ప్రదర్శించారు.

2024లో సత్తెనపల్లి నుంచి పోటీ చేస్తున్నానని, సత్తెనపల్లిలో పోటీ చేస్తానని అంబటి రాంబాబుకి ప్రకటించే దమ్ము ఉందా ఆయన సవాల్ విసిరారు. పాలు పోసిన వాళ్లే పాముల్లా కాటేస్తున్నారని సొంత పార్టీ నేతల గురించి కామెంట్ చేశారు. అన్నింటిని  ఎదుర్కొంటానని.. వారిందరికి సమాధానంగా కోడెల బిడ్డగా సత్తెనపల్లిలో పోటీ చేసి గెలిచి తీరుతానని సవాల్ చేస్తున్నారు. అధిష్టానం ప్రకటించక ముందే సీటు తనదే అని శివరాం చెప్పేసుకున్నారు. మొత్తానికి శివరాం సత్తెనపల్లిలో దూకుడుగా వెళుతున్నారు…మరి ఆ దూకుడు కొనసాగేలా శివరాంకు సీటు ఫిక్స్ చేస్తారో లేదో చూడాలి.

Share post:

Latest