కన్ఫ్యూజ్ చేస్తున్న కేశినేని.. !

తెలుగుదేశం పార్టీలో ఎంపీ కేశినేని నాని వ్యవహారంపై రకరకాల చర్చలు నడుస్తున్న విషయం తెలిసిందే…సొంత పార్టీపైనే తిరుగుబాటు జెండా ఎగరవేసిన నాని వైఖరిపై అసలు క్లారిటీ రావడం లేదు..ఒకోసారి పార్టీని తిడతారు…మరొకసారి పార్టీతో కలిసి పనిచేస్తారు…అసలు ఆయన పార్టీలో ఉంటారా? వెళ్లిపోతారా? అనేది ఏ మాత్రం తెలియడం లేదు. ఆ మధ్య సొంత తమ్ముడు కేశినేని శివనాథ్ టార్గెట్ గా కూడా కేశినేని విమర్శలు చేసిన విషయం తెలిసిందే.

ఆ తర్వాత మళ్ళీ పార్టీతో సఖ్యతగానే ఉంటున్నారు..పైగా తన కుమార్తె శ్వేత నిశ్చితర్ధానికి వచ్చిన చంద్రబాబుతో…కేశినేని సఖ్యతగా ఉన్నారు…సరే అంతా బాగుందనుకునే సమయంలో తాజాగా ఢిల్లీకి వచ్చిన చంద్రబాబుకు వెల్కం చెప్పే విషయంలో కేశినేని కాస్త దురుసుగా వ్యవహరించారు. ఢిల్లీకి వచ్చిన బాబుకు పూల బొకే ఇవ్వాలని చెప్పి గల్లా జయదేవ్..బొకేని నానికి ఇవ్వకపోయారు. అయితే ఆ బొకేని నాని గట్టిగా పక్కకు తోసేశారు. దీంతో వెంటనే గల్లా కవర్ చేసి…బొకేని బాబుకు ఇచ్చారు. ఈ అంశంలో కేశినేని వ్యవహరించిన తీరుపై తెలుగు తమ్ముళ్ళు గుర్రుగా ఉన్నారు.

కానీ బొకే ఇచ్చే విషయం తప్ప…మిగతా సమయంలో బాబుతో నాని బాగానే సఖ్యతగా ఉంటూ వచ్చారు. సరే ఇదంతా బాగానే ఉందనుకునే సమయంలో…కేశినేని పేరిట…ట్విట్టర్ లో బాబుపై సెటైర్లు పేలుతున్నాయి. వెళ్ళే దారిలో నిలబడి మోదీ కోసం ఎదురుచూసే పరిస్తితి బాబుకు వచ్చిందని ట్వీట్ వచ్చింది.

అయితే ఇది ఫేక్ ట్వీట్ అని కేశినేని అనుచరులు, కేశినేని భవన్ నుంచి ఖండన వచ్చింది. ఇలా టీడీపీలో కేశినేని వ్యవహారం చాలా చర్చనీయాంశం అవుతుంది. ఆయన వైఖరి ఏంటో పూర్తిగా క్లారిటీ రావడం లేదు. ఆయన టీడీపీలో ఉందామని అనుకుంటున్నారా? లేక వదిలి వెళ్లిపోదామని? అనుకుంటున్నారా? అనేది తెలియడం లేదు. మొత్తానికైతే టీడీపీలో కేశినేని పెద్ద కన్యూజన్ క్రియేట్ చేస్తున్నారు.

Share post:

Latest