అయ్యా కరణ్.. నీకు ఈ సెక్స్ పిచ్చి ఏంటి.. ఎవరినీ వదలవా?

బాలీవుడ్ ప్రొడ్యూసర్, డైరెక్టర్ కరణ్ జోహార్ కాఫీ విత్ కరణ్ అనే ఒక టాక్ షో నడుపుతున్న సంగతి తెలిసిందే. కొద్దిరోజుల క్రితమే ఈ షో ఏడవ సీజన్ ప్రారంభం అయ్యింది. ఇప్పటికే నాలుగు ఎపిసోడ్స్ గడిచిపోగా.. ఈ గురువారం 5వ ఎపిసోడ్ ప్రసారం కానుంది. ఈ ఎపిసోడ్‌కి లాల్ సింగ్ చద్దా మూవీ హీరో హీరోయిన్స్‌ అమీర్ ఖాన్, కరీనా కపూర్ ఖాన్ వచ్చేశారు. దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఈ ప్రోమోలో కరణ్ జోహార్ కరీనా కపూర్ ని ఉద్దేశించే పెళ్లయి బిడ్డ పుట్టిన తర్వాత సెక్స్ అనేది క్వాలిటీగా ఉంటుందా లేదా అని అడిగాడు.

ఏం చెప్పాలో అర్థంకాక ఆమె బిక్కమొహం వేసింది. నీకు తెలిసే ఉంటుంది కదా అని ఆ ప్రశ్నను దాటవేసింది. నీకు తెలిసే ఉంటుంది కదా అంటే నేనేం చెప్పను, అసలే ఈ షో మా అమ్మ చూస్తూ ఉంటుంది. నా సెక్స్ లైఫ్ గురించి ఎలా చెప్పగలను?? అని అతడు ప్రశ్నించాడు. ఇంతలోనే అమీర్ ఖాన్ జోక్యం చేసుకొని నువ్వు ఇతర వారి సెక్స్ లైఫ్ గురించి మాట్లాడితే మీ మమ్మీ ఏమి అనుకోరా దిమ్మతిరిగే సమాధానం ఇచ్చాడు. అయితే కరణ్ ఇలా సెక్స్ గురించి అడగడం ఇదేం తొలిసారి కాదు. ఈ సీజన్ మొత్తంలో అతడు ఇలాంటి ప్రశ్నలనే అడుగుతున్నాడు. దీంతో చాలామంది అయ్యా కరణ్.. నీకు ఈ సెక్స్ పిచ్చి ఏంటి, ముసలి వాళ్లను కూడా వదలవా అని ఏకిపారేస్తున్నారు.

కొన్ని రోజుల వెనక్కి వెళ్లి చూస్తే.. ఫస్ట్ ఎపిసోడ్‌లో రణ్‌వీర్‌ సింగ్‌, అలియా భట్ వచ్చారు. ఈ సమయంలో కరణ్ అలియా భట్‌ను.. “పెళ్ళయ్యాక సెక్స్ ఎలా ఉంది?” అని ఇండైరెక్ట్‌గా ప్రశ్నలు వేస్తూ ఇబ్బంది పెట్టేసాడు. ఇక రెండో ఎపిసోడ్‌లో సందడి చేసిన జాన్వీ కపూర్, సారా ఆలీ ఖాన్‌ను కూడా బోల్డ్ క్వశ్చన్స్ వేశాడు. ‘హేయ్, నువ్వు ఇంకా లేచే ఉన్నావా?’ అని మిడ్ నైట్ ఎవరికి మెసేజ్ పెట్టారు అంటూ జాన్వీ, సారాని నాటీ ప్రశ్నలు అడిగాడు. మాజీ ప్రియుడితో మళ్ళీ సెక్స్ చేస్తావా? అంటూ సారాని డైరెక్ట్‌గా ప్రశ్నించాడు. ఆ టైపు ప్రశ్నలకి వీరిద్దరూ నిస్సిగ్గుగా సమాధానాలు చెప్పి షాక్ ఇచ్చారు.

మూడవ ఎపిసోడ్‌కి వచ్చిన సమంతాని డివోర్స్, పర్సనల్ ప్రశ్నలు వేసి ఇబ్బంది పెట్టాడు. నాలుగవ ఎపిసోడ్‌కి వచ్చిన మన టాలీవుడ్ హీరో విజయ్ ని కూడా కరణ్ వదల్లేదు. సెక్స్ ఎప్పుడు చేశావ్? కారులోనే సెక్స్ ఎందుకు చేశావ్ అంటూ అడల్ట్ క్వశ్చన్లు అడిగి షాక్ ఇచ్చాడు. ఇలా కరణ్ ఈసారి తన షోకి వచ్చే ప్రతి ఒక సెలబ్రిటీని సెక్స్ గురించి అడుగుతూ విస్తుపోయేలా చేస్తున్నాడు.

Share post:

Latest