దీన్ని బట్టి చూస్తే విజయ్ దేవరకొండ.. ఉదయ్ కిరణ్ అయినట్టే..!

తెలుగు ఇండస్ట్రీలో రౌడీ హీరో అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. మొదట చిన్న చిన్న పాత్రలలో నటించి ఇప్పుడు హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. మొదట నువ్విలా సినిమాతో ఎంట్రీ ఇచ్చిన విజయ్ దేవరకొండ ఆ తర్వాత లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ఎవడే సుబ్రహ్మణ్యం వంటి సినిమాలలో సపోర్టింగ్ రోల్స్ లో నటించాడు. ఆ తర్వాత పెళ్లిచూపులు సినిమాతో హీరోగా మారారు. అర్జున్ రెడ్డి సినిమాతో స్టార్ హీరోగా పేరు సంపాదించారు. అయితే మధ్యలో ద్వారక అనే సినిమాలో నటించగా అది భారీ డిజాస్టర్ అయ్యింది. ఇక మహానటి సినిమాలో కూడా స్పెషల్ రోల్ లో కనిపించి బాగా అలరించాడు విజయ్ దేవరకొండ.Interview : Vijay Devarakonda – Liger will be a smash hit | 123telugu.comఇక గీత గోవిందం సినిమాతో ఫ్యామిలీ హీరోగా అనిపించుకున్నా.. ఆ తర్వాత నోట సినిమాతో ఫ్లాప్ గా నిలిచాడు. ఇక అదే తరహా లో వచ్చిన టాక్సీవాలా సినిమా ఆశించిన స్థాయిలో ఫ్యాన్స్ ను మెప్పించలేకపోయింది.. ఇక తర్వాత డియర్ కామ్రేడ్ సినిమా కూడా భారీ డిజాస్టర్ గా మిగిలింది. ఇకపై ప్రేమ కథలు చేయనన్నట్టు ఆ సినిమాతో ప్రకటించారు. కానీ ఆ తర్వాత వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా లో నటించగా అది కూడా డిజాస్టర్ గా మిగిలిపోయింది. దీంతో కాస్త గ్యాప్ తీసుకొని తాజాగా లైగర్ సినిమాలో నటించాక ఈ సినిమాకి ఏకంగా పాన్ ఇండియా హీరోగా పేరుపొందాడు.Superstars slient on Uday Kiran suicideకానీ ఈ చిత్రం కూడా మిక్స్డ్ టాక్ తో కొనసాగుతోంది. ఇక దీంతో ఈ సినిమా అల్ట్రా డిజాస్టర్ దిశగా పయనిస్తోంది అంటూ కొంతమంది క్రిటిక్స్ తెలియజేస్తున్నారు. భారీ అంచనాల మధ్య విడుదలైన లైగర్ సినిమా తీవ్రంగా నిరాశపరిచినట్లు సమాచారం. దీంతో విజయ్ దేవరకొండ మొదటి రోజు కలెక్షన్లు బాగానే రానిచ్చినప్పటికీ.. విజయ్ కెరియర్ లో హిట్ల కంటే ఎక్కువ ఫ్లాపులు ఉన్నాయని చెప్పవచ్చు. ఇక మొదట ఉదయ్ కిరణ్ మాదిరి మంచి విజయాలను అందుకున్న విజయ్ దేవరకొండ. ఇక సినిమా కథల ఎంపికలో తప్పు జరగడంతో ఇలా వరుస ప్లాప్ లను చవిచూడాల్సి వస్తోంది…. గతంలో ఉదయ్ కిరణ్ కూడా మంచి హిట్లు పడ్డ సమయంలో కథల ఎంపిక విషయంలో తప్పు చేయడంతో వరుస ప్లాపులను చూశాడు. ఇప్పుడు విజయ్ పరిస్థితి కూడా ఉదయ్ కిరణ్ లాగే ఉందనడానికి ఇదొక ఉదాహరణ అని చెప్పవచ్చు..

Share post:

Latest