జనసేన సోలోగా గెలిచే సీట్లు ఇవేనా?

గత ఎన్నికల్లో ఎలాగో సత్తా చాటలేకపోయినా..ఈ సారి ఎన్నికల్లో మాత్రం సత్తా చాటాలని జనసేన చూస్తుంది..ఖచ్చితంగా ఈ సారి మంచి ఫలితాలు రాబట్టుకోవాలని జనసైనికులు ప్రయత్నిస్తున్నారు. 2019లో తొలిసారి బరిలో దిగి జనసేన దారుణ పరాజయాన్ని మూటగట్టుకున్న విషయం తెలిసిందే. కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకుని, ఆ పార్టీకేవలం ఒక సీటు మాత్రమే గెలుచుకుంది..పోటీ చేసిన రెండు చోట్ల పవన్ ఓడిపోయారు.

- Advertisement -

గెలిచిన ఒక్క ఎమ్మెల్యే కూడా వైసీపీ వైపుకు వెళ్లారు. అలా దారుణ పరాజయాన్నిమూటగట్టుకున్న జనసేన ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తుంది. ఆ దిశగా పవన్ సైతం పనిచేస్తున్నారు. అయితే పార్టీ బలోపేతం కోసం పవన్ కష్టపడుతున్నారు…కానీ ఆ పార్టీ ఏ మేర సత్తా చాటుతుంది అంటే…కొంతవరకే ఆ పార్టీ బలం చాటుకునే అవకాశం ఉంది.

సింగిల్ గా పోటీ చేస్తే జనసేన చాలా నియోజకవర్గాల్లో ఓట్లు చీల్చి టీడీపీకి డ్యామేజ్ చేస్తుందని తెలుస్తోంది..అంటే గత ఎన్నికల మాదిరిగానే. కానీ జనసేన గెలుపు అవకాశాలు ఉన్న సీట్లు చాలా తక్కువ ఉంటాయని తెలుస్తోంది. ఇప్పుడున్న పరిస్తితుల్లో ఆపార్టీకి గెలుపు అవకాశాలు ఉన్న సీట్లు వచ్చి…భీమవరం…అది కూడా పవన్ పోటీ చేస్తేనే. ఇక సింగిల్ గా జనసేన సత్తా చాటే స్థానాలు వచ్చి నరసాపురం, తాడేపల్లిగూడెం, అమలాపురం, రాజోలు, పి.గన్నవరం, ముమ్మిడివరం స్థానాలు మాత్రమే అని తెలుస్తోంది.

ఇక పవన్ మళ్ళీ పోటీ చేస్తే గాజువాకలో కూడా గెలిచే ఛాన్స్ ఉంది.  అంటే జనసేన సింగిల్ గా పోటీ చేస్తే మళ్ళీ సింగిల్ డిజిట్ కే పరిమితమవుతుందని తెలుస్తోంది. అదే సమయంలో పొత్తుఉంటే మాత్రం అటు టీడీపీ లాభపడటంతో పాటు…జనసేనకు కూడా లాభం జరుగుతుందని చెప్పొచ్చు. కానీ అటు టీడీపీ, ఇటు జనసేనశ్రే ణులు ఎవరికి వారే తమ బలం పెరిగిపోయిందని ఎక్కువ ఊహించుకుంటున్నారు. మొత్తానికైతే జనసేనకు ఎక్కువ సీట్లలో గెలిచే ఛాన్స్ కనబడటం లేదు.

Share post:

Popular