జగన్ డేరింగ్ డెసిషన్…!

పనితీరు బాగోని ఎమ్మెల్యేలని ఏ మాత్రం ఉపేక్షించే ప్రసక్తి లేదని జగన్ ఫిక్స్ అయిపోయినట్లు తెలుస్తోంది…ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేల అందరికీ సీట్లు ఇస్తే…నెక్స్ట్ ఎన్నికల్లో సగానికి సగం మంది ఓడిపోవడం గ్యారెంటీ అని సర్వేలు చెబుతున్నాయి. కాబట్టి కొందరు ఎమ్మెల్యేలకు సీటు ఇవ్వకుండా, వారి ప్లేస్ లో కొత్త అభ్యర్ధులని పెడితేనే కలిసొస్తుందనే ఫార్ములాతో జగన్ ముందుకెళుతున్నారు.

రాజకీయాల్లో ఎన్నిక ఎన్నికకు మార్పులు ఉండాలి..అలా లేకపోతే ప్రజల్లో ఆదరణ ఉండదు. అందుకే జగన్ కొందరు ఎమ్మెల్యేలని మార్చేయాలని డిసైడ్ అవుతున్నారు. కాకపోతే ఏ మాత్రం మొహమాటం లేకుండా జగన్ ముందుకెళ్లడానికి చూస్తున్నారు. వాస్తవానికి జగన్‌కు గట్స్ ఎక్కువ…రాజకీయాల్లో డేరింగ్ డెసిషన్స్ తీసుకోవడంలో జగన్‌ని మించిన వారు లేరు. అవి ఫెయిల్ అయిన, సక్సెస్ అయినా సరే తన అనుకున్నదే జగన్ చేస్తారు.

వాస్తవానికి 2014లో తనకు అండగా నిలబడిన వారికి సీట్లు ఇచ్చారు. అయితే అందరికీ సీట్లు ఇవ్వడం మేలు చేయలేదు…కొన్ని చోట్ల మార్పులు చేస్తే బాగుంటుందని కొందరు పార్టీ పెద్దలు జగన్‌కు సూచించారట అయినా సరే జగన్ డేర్‌గా తనకు సపోర్ట్ గా నిలిచిన వారికే సీట్లు ఇచ్చారు. కానీ ఈ ఫార్ములా పెద్దగా వర్కౌట్ కాలేదు. 2014 ఎన్నికల్లో ఓటమి పాలవ్వాల్సి వచ్చింది.

ఇక 2019 ఎన్నికలోచ్చేసరికి జగన్…2014లో గెలిచిన కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వలేదు. అలాగే చాలా నియోజకవర్గాల్లో యువ నేతలకు సీట్లు ఇచ్చారు. ఈ ఫార్ములా బాగా వర్కౌట్ అయ్యి…2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చారు. ఇక నెక్స్ట్ ఎన్నికల్లో కూడా అధికారంలోకి రావాలని జగన్ చూస్తున్నారు..అందుకే ఈ సారి కూడా డేరింగ్ స్టెప్ తీసుకోవడానికి రెడీ అవుతున్నారు..దాదాపు 50 మందిపైనే సిట్టింగులకు సీటు ఇవ్వరని తెలుస్తోంది…వారు అసంతృప్తి వ్యక్తం చేసిన, పార్టీ జంప్ చేస్తామని బెదిరించినా సరే జగన్ తగ్గేలా లేరని తెలుస్తోంది…మొత్తానికి కొందరు ఎమ్మెల్యేలపై వేటు పడటం ఖాయంగా కనిపిస్తోంది.