వివాహానికి సిద్ధమైన జబర్దస్త్ నటి.. ఫోటోలు వైరల్..!

ఈ మధ్యకాలంలో అటు సినీ నటీనటులు.. ఇటు బుల్లితెర నటీనటులు కూడా వివాహం చేసుకుంటూ ఒక ఇంటి వారు అవుతున్నారు. ఇక ఈ క్రమంలోనే జబర్దస్త్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకున్న షబీనా కూడా పెళ్లి పీటలు ఎక్కబోతోంది. ఇక అంతేకాదు ఎంగేజ్మెంట్ కూడా అయినట్లు, అందుకు సంబంధించిన ఫోటోలు కూడా నెట్టింట వైరల్ అవుతూ ఉండడం గమనార్హం. ఇక అసలు విషయాలను ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.

ఈటీవీ లో ప్రసారమవుతున్న జబర్దస్త్ షో గత తొమ్మిది సంవత్సరాల నుంచి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈ షోకి ఉన్న ఫాలోయింగ్, పాపులారిటీ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇందులో జడ్జిలు మారినా.. కంటెస్టెంట్లు కొత్తవాళ్లు వచ్చినా సరే షో రేటింగ్ మాత్రం తగ్గలేదని చెప్పాలి. ఇక ఎంతోమంది కమెడియన్స్ ను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఘనత కూడా జబర్దస్త్ కి దక్కుతుందని చెప్పవచ్చు. అంతేకాదు ఇప్పటికే చాలామంది జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకొని వెండితెరపై చక్రం తిప్పుతున్న వారు కూడా ఉన్నారు. గతంలో మగవాళ్లే లేడీ గెటప్పులు వేసేవారు కానీ 5 సంవత్సరాల నుంచి లేడీ ఆర్టిస్టులు కూడా ఇందులో కనిపిస్తూ ఉండడం గమనార్హం.

అలా కెవ్వు కార్తీక్ టీం లో నటిస్తున్న షబీనా షేక్ కూడా ఒకరు. ఇక ఈమె కస్తూరి , అత్తారింటికి దారేది, నా పేరు మీనాక్షి వంటి సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇక అక్కడి నుంచి జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈమె పేరు మరింతగా పాపులర్ అయిందని చెప్పవచ్చు. ఇక స్కిట్ లో ఎక్కువగా నరేష్ పై ఈమె చేసే పంచులు బాగా పేలేవి. తాజాగా ఈమె దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టబోతోందని సమాచారం. అంతేకాదు అందుకు సంబంధించిన ఎంగేజ్మెంట్ ఫోటోలు కూడా షబీనా షేర్ చేసింది. మున్నా అనే వ్యక్తిని ఈమె వివాహం చేసుకోబోతున్నట్లు సమాచారం.

Share post:

Latest