హిందూపురం ఎంపీ సీటు టీడీపీదేనా?

తెలుగుదేశం పార్టీ కంచుకోటల్లో హిందూపురం పార్లమెంట్ స్థానం కూడా ఒకటి అని చెప్పొచ్చు..మొదట నుంచి ఈ పార్లమెంట్ లో టీడీపీ మంచి విజయాలు సాధిస్తూ వచ్చింది. 1984, 1996, 1999, 2009, 2014 ఎన్నికల్లో హిందూపురం పార్లమెంట్ లో టీడీపీ గెలిచింది..కానీ 2019 ఎన్నికల్లో జగన్ వేవ్ లో టీడీపీ ఓటమి పాలైంది..అనూహ్యంగా పోలీస్ ఉద్యోగం వదిలేసి వచ్చిన గోరంట్ల మాధవ్ వైసీపీ తరుపున గెలిచారు. ఇక పోలీసుగా ఉన్నప్పుడు మాధవ్ ఎన్ని వివాదాల్లో ఉన్నారో తెలిసిందే..అలాగే అప్పుడు టీడీపీ ఎంపీగా ఉన్న జేసీ దివాకర్ రెడ్డిపై ఒంటికాలి మీద వెళ్లారు. తొడగొట్టి మీసం కూడా మేలేశారు.

ఇలా ఎక్కువ వివాదాల్లో ఉండే మాధవ్…జగన్ గాలిలో ఎంపీగా గెలిచేశారు. అయితే ఎంపీగా గెలిచిన దగ్గర నుంచి మాధవ్ ఇంకా ఎక్కువ వివాదాల్లో చిక్కుకుంటున్నారు. కియా ప్రతినిధులని బెదిరించడం..టీడీపీ నేతలపై పరుషపదజాలం వాడటం..ఏకంగా లోక్ సభ లో మాట్లాడుతున్న రామ్మోహన్ నాయుడుపై మాధవ్ దూసుకెళ్లడం చేశారు. ఇలా పలు వివాదాల్లో చిక్కుకున్న మాధవ్…తాజాగా న్యూడ్ వీడియో కాల్ వ్యవహారం బయటకొచ్చింది…ఇది దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.

అలాగే అది మార్ఫింగ్ చేశారని మాధవ్ చెబుతున్నా సరే ప్రజలు నమ్మే పరిస్తితుల్లో లేరు. అలాగే సొంత పార్టీ నుంచి కూడా మాధవ్ కు మద్ధతు రావడం లేదు…ఇక మాధవ్ వల్ల పార్టీకి నష్టం జరగకముందే…మాధవ్ ని సస్పెండ్ చేయడానికి జగన్ సిద్ధమయ్యారని తెలుస్తోంది. అయితే మాధవ్ వల్ల వైసీపీకి బాగానే డ్యామేజ్ జరిగినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా హిందూపురం పార్లమెంట్ పరిధిలో..నెక్స్ట్ ఈ సీటులో వైసీపీ గెలుపు చాలా కష్టమయ్యేలా ఉంది.

ఒకవేళ అభ్యర్ధిని మార్చినా సరే వైసీపీకి లాభం ఉండేలా లేదు. ఇప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయినట్లు ఉంది. ఈ సారి హిందూపురం పార్లమెంట్ టీడీపీ వశమయ్యేలా ఉంది. మొత్తానికి మాధవ్ వల్ల వైసీపీకి గట్టి దెబ్బ తగిలేలా ఉంది.