చిరంజీవి – అశ్వ‌నీద‌త్ కాంబినేష‌న్ వెన‌క ఇంత గొప్ప హిస్ట‌రీ ఉందా…!

తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర నిర్మాతల‌లో ఒకరైన వైజయంతి మూవీస్ బ్యానర్ అధినేత సి అశ్వినీ దత్, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి అశ్వినీదత్ కాంబినేషన్‌కు తిరుగులేని క్రేజ్ ఉంది. వీరిద్దరి కాంబినేషన్లో నాలుగు సినిమాలు వచ్చాయి. వాటిలో మూడు సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఒక‌టి ప్లాప్ అయ్యింది. అస‌లు వీరి కాంబినేష‌న్‌కు ఉన్న క్రేజ్ ఏంటో చూద్దాం.

జగదేకవీరుడు అతిలోకసుందరి:
తెలుగు సినీ పరిశ్రమలో చిరంజీవి హీరోగా నిర్మాత సి. అశ్వినీ దత్ కలయికలో మొదటిసారిగా జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాతెర‌కెక్కింది. ఈ సినిమాకు కే. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో హీరోయిన్ గా అతిలోకసుందరి శ్రీదేవి నటించింది. ఈ సినిమాకు ఇళయరాజా మ్యూజిక్ డైరెక్టర్‌గా ఉన్నారు.ఈ సినిమాలోని పాటలు ఆల్ టైం సూపర్ హిట్ గా నిలిచాయి.

ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. ఈ సినిమా రిలీజ్ అయి 32 సంవత్సరాలు పూర్తయింది. జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాలో హిందీలో కూడా డ‌బ్‌ చేశారు. అక్కడ ఆద్మీ ఔర్ అప్సర పేరుతో రిలీజ్ చేశారు ఈ సినిమా అక్కడ కూడా సూపర్ హిట్ అయింది. అంతేకాకుండా ఈ సినిమాను ఇతర భాషల్లో కూడా డబ్ చేస్తే అక్కడ కూడా సూపర్ హిట్ అయింది.

చూడాలని వుంది:
వైజయంతి మూవీస్ బ్యానర్ పై చిరంజీవి కాంబినేషన్ లో వచ్చిన రెండో చిత్రం చూడాలని వుంది. ఈ సినిమాకు గుణశేఖర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో అంజలా జవేరి – సౌందర్యలు హీరోయిన్ గా నటించారు. ప్రకాష్ రాజ్ విలన్ గా చేశారు. మ‌ణిశ‌ర్మ పాట‌లు గుణ‌శేఖ‌ర్ టేకింగ్, చిరు డ్యాన్సులు అప్ప‌ట్లో హైలెట్‌. 63 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది.

ఇంద్ర:
చిరంజీవి – వైజయంతి మూవీస్ బ్యానర్ లో మూడో సినిమాగా ఇంద్ర సినిమా వచ్చింది. ఈ సినిమాకు దర్శకుడు బి.గోపాల్. చిన్ని కృష్ణ కథ అందించారు. ప‌రుచ‌రి బ్రదర్స్ మాటలు రాశారు. ఈ సినిమాకు మణి శర్మ స్వరాలు ఇవ్వ‌గా, ఒక పాటకు ఆర్పి. పట్నాయక్ సంగీతం అందించారు. చిరంజీవి సర‌స‌న‌ సోనాలి బింద్రే ,ఆర్తి అగర్వాల్ నటించారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. 2002లో వ‌చ్చిన ఈ సినిమా 122 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది.

జై చిరంజీవ:
అశ్విని దత్ – చిరంజీవి కాంబోలో వచ్చిన నాలుగో సినిమా జై చిరంజీవ. ఈ సినిమాకు కె. విజయభాస్కర్ దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ ప్లాప్‌గా మిగిలిపోయింది. ఓవ‌రాల్‌గా ఈ కాంబోలో వ‌చ్చిన నాలుగు సినిమాల‌లో మూడు సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఒక్క సినిమా మాత్ర‌మే ప్లాఫ్ గా నిలిచింది. మొత్తంగా వీళ్ళ కలయికలో వచ్చిన చిత్రాల్లో 90 శాతం సక్సెస్ సాధించాయి.