సుమ పెళ్లి చీర వెన‌క ఇంత క‌థ న‌డిచిందా…? ధ‌ర తెలిస్తే ఆశ్చ‌ర్య పోవాల్సిందే…!

తెలుగు బుల్లితెరపై యాంకర్ సుమ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ఇక తన ప్రయాణాన్ని కూడా మొదట బుల్లితెర మీద నుంచి మొదలు పెట్టింది. ఇక ఈమె భర్త రాజీవ్ కనకాల గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. వీరిద్దరూ కూడా బుల్లితెర మీద నుంచి తమ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. రాజీవ్ కనకాల ప్రస్తుతం పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ బిజీగా ఉన్నారు. సుమ తెలుగులో నెంబర్ వన్ యాంకర్ గా ఎన్నో సంవత్సరాల నుంచి కొనసాగుతూనే ఉన్నది.

Anchor Suma : సుమ కనకాల సినిమా పోస్టర్ రెడీ! న్యూ లుక్.. సీరియస్ కిక్

ఆమె యాకంర్‌గానే కాకుండా సొంతంగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా వ‌ర‌ల‌క్ష్మివ‌త్రం సందర్భంగా షాపింగ్‌కి వెవెళ్ళారు సుమ. అ సంద‌ర్బంలోనే ఈ షాపింగ్ కి సంబంధించిన విష‌యాల‌ను అభిమానుల‌తో పంచుకున్నారు. ప‌ట్టుచీర షాపింగ్ కోసం షింఘానియా అనే షాపింగ్ మాల్ కు వెళ్ళిన సుమ ..అక్కడ ఉన్న రకరకాల చీర ల గురించి కూడా తన వీడియో లో పంచుకున్నారు. అప్ప‌డు అక్క‌డ ఉన్న ప‌ట్టు చీరల గురించి వివ‌రిస్తూ..” ఈ షాప్ లో ప‌దివెల నుండి ప‌ది ల‌క్ష‌ల వ‌ర‌కు విలువ చేసే ప‌ట్టు చీర‌లు ఉన్నాయని ” సుమ చెప్పుకొస్తుంది.

సుమ గురించి ప్రత్యేకంగా చెప్పాలా..ఆమె ఎక్కడ ఉంటే అక్కడ నవ్వులు పూస్తాయి. ఇక షాపింగ్ కి వెళ్ళిన సుమ అక్క‌డ కూడా సేల్స్ మెన్ తో తనదైన స్టైల్ లో పంచ్ లు వేస్తూ నవ్వించారు. ” నాకు 15000 లోపు ఉండే ప‌ట్టు చీర‌లు కావాల‌ని అన్ని సుమ అన‌డంతో.. “మీ రెంజ్ ఇది కాదు మేడమ్.. మీరు ఫ‌స్ట్ ఫ్లోర్ కి వెళ్లండి” అంటూ సరదాగా మాట్లాడుతాడు స‌ల్స్ మెన్. ఇక అప్పుడు సుమ స్పందిస్తూ..” మీరు మా రేంజ్ అనుకుంటారు కాని మేము తిరిగి ఇక్క‌డే తీసుకొవాలి అని మాకు ఉంటుంది” అంటూ తాను కూడా కౌంట‌ర్లు వేసింది. ఈ సంధర్భంలోనే.. అక్క‌డ ఉన్న చీర‌ను చూస్తు దీని ధ‌ర ఎంత అని అడ‌గ‌గా రూ 2ల‌క్ష‌ల అని, ఇది పెళ్లి కూతురు స్పెషల్ చీర అని ” చెప్తాడు సేల్స్ మ్యాన్. “అమ్మో 2 లక్షలే.. మా పెళ్లి లో నేను క‌ట్టుకున్న చీర 11000 “అంటూ త‌న పెళ్లి చీర ధ‌ర చెప్పేంది. మా పెళ్లి ఎప్పుడో అయింది అనుకోకుండి మా పెళ్లి ఈ మాధ్య‌నే అయింది అంటూ చ‌మ‌త్క‌రించారు సుమ. దీంతో ఈ వీడియో ట్రెండింగ్ లో ఉంది.

 

Share post:

Latest