ఎన్డీయేలోకి టీడీపీ..టైమ్ ఉందట!

ఏదేమైనా గాని 2019 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయి ప్రతిపక్షానికి పరిమితమైన దగ్గర నుంచి చంద్రబాబు…ఎలాగైనా బీజేపీకి దగ్గరవ్వాలని చూస్తున్నారనే సంగతి తెలిసిందే..అదే ఎన్నికల ముందు బీజేపీ నుంచి పొత్తు విడిపోకుండా ఉంటే…ఎలాగైనా ఆ ఎన్నికల్లో గెలిచేవాళ్లం అని టీడీపీ శ్రేణులు ఇప్పటికీ భావిస్తుంటాయి. అందుకే ఎన్నికల తర్వాత నుంచి బాబు…ఎలాగోలా బీజేపీ దగ్గరవ్వడానికి ట్రై చేస్తారనే సంగతి అందరికీ తెలుసు.

కానీ బీజేపీ మాత్రం బాబుని దగ్గరకు రానిచ్చే ఛాన్స్ లేదన్నట్లు రాజకీయం చేసేది. ఆ పార్టీ నేతలు మళ్ళీ బాబుతో కలిసే ప్రసక్తి లేదని చెబుతూ వచ్చారు. అయితే ఇటీవల ఢిల్లీలో మోదీ-బాబు కలవడం పెద్ద చర్చనీయాంశమైంది. ఇక ఆ తర్వాత నుంచి టీడీపీ-బీజేపీలు కాస్త క్లోజ్ గానే ముందుకెళుతున్నట్లు తెలుస్తోంది. ఎప్పుడు టీడీపీపై విమర్శలు చేసే రాష్ట్ర బీజేపీ నేతల వర్షన్ కూడా మారింది…సోము వీర్రాజు లాంటి వారే బాబుని పొగుడుతూ మాట్లాడారు.

దీని బట్టి చూస్తే మళ్ళీ టీడీపీతో పొత్తుకు బీజేపీ రెడీ అవుతుందని తెలుస్తోంది. ఎందుకంటే పొత్తు లేకుండా ఏపీలో బీజేపీ ఒక సీటు కూడా గెలుచుకోలేదు. జనసేనతో పొత్తు ఉన్నా సరే…బీజేపీకి బెనిఫిట్ లేదు. టీడీపీతో పొత్తు ఉంటేనే నాలుగైదు సీట్లు గెలుచుకోవచ్చు. మొత్తానికి చూసుకుంటే ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తు దాదాపు ఖాయమనే ప్రచారం జరుగుతుంది. ఎన్నికల ముందు ఈ పొత్తుపై క్లారిటీ వస్తుందని అంటున్నారు.

అయితే తాజాగా టీడీపీ అనుకూల మీడియాలో..ఎన్డీయేలోకి టీడీపీ వెళుతుందంటూ కథనాలు ఇస్తుంది. దసరా లేదా దీపావళి తర్వాత ఈ చేరిక ఉంటుందని చెబుతుంది…పైగా ఈ మధ్య హైదరాబాద్‌కు వచ్చి ఎన్టీఆర్‌ని కలిసిన అమిత్ షా..నారా లోకేష్‌తో కూడా సీక్రెట్‌గా కలిశారని కథనాలు వచ్చాయి. కానీ ఇందులో ఎంత నిజముందో క్లారిటీ లేదు. అలాగే టీడీపీ అనుకూల మీడియా చెప్పినట్లు ఇప్పుడే ఎన్డీయేలోకి టీడీపీ వెళ్ళడం కష్టమని విశ్లేషకులు అంటున్నారు…ఎన్నికల ముందే ఈ అంశం గురించి క్లారిటీ వస్తుందని చెబుతున్నారు.