చిట్టిబాబుకు చెక్ పెట్టేసేలా ఉన్నారే!

ఈ సారి ఎన్నికల్లో టీడీపీ-జనసేన గాని కలిసి పోటీ చేస్తే…చాలామంది వైసీపీ ఎమ్మెల్యేలకు చెక్ పడిపోతుందని చెప్పొచ్చు…నిజానికి గత ఎన్నికల్లోనే రెండు పార్టీలు కలిసి పోటీ చేసి ఉంటే…వైసీపీ తరుపున 151 మంది ఎమ్మెల్యేలు గెలిచేవారు కాదు…ఇందులో ఏ మాత్రం డౌట్ లేదు..కనీసం 30 సీట్లు అయిన వైసీపీ కోల్పోయేది. కేవలం టీడీపీ-జనసేన విడిగా పోటీ చేయడం వల్ల పలువురు ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి గెలిచేశారు. ఈ సారి కూడా అదే జరిగితే మళ్ళీ వైసీపీ ఎమ్మెల్యేలకు ప్లస్సే…కానీ అలా కాకుండా పొత్తు ఉంటే వైసీపీ ఎమ్మెల్యేలకు గెలుపు కష్టం.

అలా గెలుపు కష్టమయ్యే ఎమ్మెల్యేల్లో పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు ఖచ్చితంగా ఉంటారని చెప్పొచ్చు. తూర్పు గోదావరి జిల్లాలో ఎస్సీ రిజర్వడ్ స్థానంగా ఉన్న పి.గన్నవరం స్థానంలో ఎస్సీలతో పాటు కాపుల ఓట్లు ఎక్కువ. అందుకే ఇక్కడ జనసేన ప్రభావం కాస్త ఎక్కువగానే ఉంటుంది. 2014లో పవన్…టీడీపీకి మద్ధతు ఇవ్వడం వల్ల..పి.గన్నవరంలో టీడీపీ 13 వేల ఓట్ల మెజారిటీతో గెలిచింది. అప్పుడు వైసీపీ నుంచి చిట్టిబాబు పోటీ చేసి ఓడిపోయారు.

 

2019 ఎన్నికల్లో రెండు పార్టీలు విడిగా పోటీ చేయడంతో చిట్టిబాబు 22 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. చిట్టిబాబుకు 67 వేల ఓట్లు రాగా, టీడీపీకి 45 వేలు, జనసేనకు 36 వేల ఓట్లు పడ్డాయి. అంటే ఇక్కడ టీడీపీ-జనసేన ఓట్లు కలిపి దాదాపు 81 వేల ఓట్లు. అంటే అప్పుడే కలిసి పోటీ చేసి ఉంటే చిట్టిబాబుకు గెలుపు దక్కేది కాదు. ఇక వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన కలిసి పోటీ చేయడానికే మొగ్గు చూపుతున్నాయి. ఇటు నియోజకవర్గంలో రెండు పార్టీల నేతలు కలిసి పనిచేస్తున్నారు..దీంతో నెక్స్ట్ చిట్టిబాబుకు టీడీపీ-జనసేన కలిసి చెక్ పెట్టేలా ఉన్నాయి.

Share post:

Latest