ఎమ్మెల్యేలుగా ఎంపీలు…సెట్ అవుతుందా?

నెక్స్ట్ ఎన్నికల్లో గెలిచి అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా ప్రతిపక్ష టీడీపీ పనిచేస్తున్న విషయం తెలిసిందే…ఎలాగైనా నెక్స్ట్ అధికారం దక్కించుకోవాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు…ఈ సారి గాని అధికారం దక్కకపోతే జగన్ దెబ్బకు…టీడీపీ పరిస్తితి ఏం అవుతుందో చెప్పాల్సిన పని లేదు. అందుకే ఈ సారి జగన్ కు చెక్ పెట్టాలని బాబు భావిస్తున్నారు…ఈ క్రమంలోనే ఎక్కడకక్కడ కొత్త స్ట్రాటజీలతో ముందుకొస్తున్నారు.

ఈ సారి బలమైన అభ్యర్ధులని అసెంబ్లీ స్థానాల బరిలో దించాలని చూస్తున్నారు. బలమైన అభ్యర్ధులు ఉంటేనే వైసీపీని ఓడించడం సాధ్యమవుతుందని బాబు భావిస్తున్నారు. అయితే ఈ సారి ఎంపీలని అసెంబ్లీ స్థానాల్లో దింపుతారని తెలిసింది…గత ఎన్నికల్లో జగన్ గాలిని సైతం ఎదురుకుని టీడీపీ తరుపున ముగ్గురు ఎంపీలు గెలిచారు. ఇక వారిని ఈ సారి అసెంబ్లీ స్థానాల బరిలో దింపితే బెటర్ అని బాబు ఆలోచిస్తున్నారట.

ఇప్పటికే రామ్మోహన్ నాయుడు అసెంబ్లీ స్థానంలో పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు కథనాలు వస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఆయన నర్సన్నపేట స్థానంలో పోటీ చేయాలని భావిస్తున్నారట. ఈ విషయం అధినేత చంద్రబాబుకు కూడా చెప్పినట్లు సమాచారం. నర్సన్నపేటలో మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ ఉన్నారు…అక్కడ ఆయనకు చెక్ పెట్టడానికి టీడీపీ మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి బలం సరిపోవడం లేదు. అందుకే అక్కడ రామ్మోహన్ నాయుడు బరిలో దిగుతారని తెలుస్తోంది.

ఇటు విజయవాడ ఎంపీ కేశినేని నాని సైతం…వచ్చే ఎన్నికల్లో  విజయవాడ పశ్చిమ అసెంబ్లీలో పోటీ చేయొచ్చని, విజయవాడ పార్లమెంట్ లో నాని తమ్ముడు శివనాథ్ పోటీ చేయొచ్చని ప్రచారం జరుగుతుంది…ఒకవేళ నాని పోటీ నుంచి తప్పుకుని, తన తనయురాలు కేశినేని శ్వేతని అసెంబ్లీ బరిలో పెట్టొచ్చని తెలుస్తోంది.

అటు గుంటూరు ఎంపీగా ఉన్న గల్లా జయదేవ్…ఈ సారి తన సొంత నియోజకవర్గం చంద్రగిరిలో పోటీ చేయొచ్చని తెలుస్తోంది. ఇది చంద్రబాబు సొంత స్థానం కూడా…ఇక్కడ టీడీపీ గెలిచి చాలా ఏళ్ళు అయింది…పైగా ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హవా ఎక్కువ. చెవిరెడ్డి లాంటి బలమైన నేతని ఢీకొట్టాలంటే గల్లా ఫ్యామిలీ ఉండాల్సిందే అని టీడీపీ కేడర్ భావిస్తుంది. మరి చూడాలి ఈ సారి ఎంపీలు, ఎమ్మెల్యేలుగా బరిలో ఉంటారో లేదో.