మెగాస్టార్ ఆటోజానీ వ‌స్తోందా… ఇలా ట్విస్ట్ ఇచ్చారేంటి…!

పూరీ- చిరంజీవి కాంబోలో ఆటోజాని రావ‌ల్సిఉంది కాని కొన్ని అనివార్య కార‌ణాల వ‌ల్ల అగిపొయింది. అయితే ఇటీవ‌ల వారి ట‌ర్మ్స్ బాగానే ఉన్నాయి. రీసెంట్‌గా పూరి గాడ్ ఫాదర్ సెట్ లో చిరంజీవిని కలవటం… అదే క్రమంలో పూరి ఈ సినిమాలో ఒక కీలకపాత్రర పోషించడం… ఇలా చూస్తుంటే వీళ్ళిద్దరు మ‌ళ్లీ క‌లిసి ప‌నిచేసేందుకు ఆస‌క్తిగానే ఉన్నార‌ని తెలుస్తోంది.

తాజాగా చిరంజీవి లైగర్ సినిమా ప్రమోషన్లకి రావడం వంటి.. వీరి మ‌ధ్య బంధం మ‌రింత స్ట్రాంగ్‌గా ఉన్న‌ట్టే అనిపిస్తోంది. ఈ క్రమంలోనే పూరి చిరంజీవికి ఆటో జానీ కథను మళ్ళీ వినిపించినట్లు తెలుస్తుంది. కథలో కొన్ని మార్పులు చేశారన్న వార్త కూడా బయటకు వచ్చింది. ఈ క్రమంలో మెగాస్టార్ అభిమానులకు ఆటో జానీ సినిమాపై ఆశలు రేకెత్తుతున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్ లో ఆటోజానీ విషయం ఇంట్రెస్టింగ్ గా మారింది.

Puri Jagannath Meets Chiranjeevi

పూరి అసలు చిరంజీవి రీ ఎంట్రీ సినిమాకు దర్శకత్వం వహించాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల వీరి సినిమా ఆగిపోయింది. అప్పుడు పూరి చిరంజీవితో ఎప్పటికైనా సినిమా చేస్తా అది 150 సినిమా కాకపోతే 151, 152 అయ‌న‌ సినిమా చేస్తానని చెప్పాడు. తర్వాత ఇద్దరు ఎవరు సినిమాల్లో వాళ్ళు బిజి అయిపోయారు. ప్రస్తుతం పూరి లైగ‌ర్‌ సినిమా ప్రమోషన్ల‌లో బిజీగా ఉన్నాడు. తర్వాత పూరి జనగణమన సినిమాతో చేయ‌నున్నాడు. ఆ తర్వాత ఎప్పుడైనా ఆటోజానీ వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయి.

Share post:

Latest