ఐదోసారి కొడాలి కష్టపడాలా?  

ఏపీ రాజకీయాల్లో కొడాలి నాని లాంటి నేతల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు….మాస్ లీడర్లుగా ఉన్న పేరున్న నేతలు జనాలకు బాగా తెలుస్తారు..అలాగే రాజకీయం విజయాలు అందుకుంటారు. అయితే ఏపీ రాజకీయాల్లో మాస్ లీడర్ గా ఉన్న కొడాలి నానికి ఇంతవరకు ఓటమి ఎదురవ్వలేదు..అలాగే  గెలుపు విషయంలో పెద్దగా కష్టపడలేదు…వరుసగా నాలుగుసార్లు సునాయసంగానే గెలిచేశారు. 2004లో రాష్ట్రంలో వైఎస్సార్ వేవ్ ఎలా ఉందో తెలిసిందే…అంతటి వేవ్ లో కూడా తొలిసారి గుడివాడ నుంచి టీడీపీ తరుపున పోటీ చేసిన నాని ఎమ్మెల్యేగా గెలిచిన విషయం తెలిసిందే.

ఆ వేవ్ లో కూడా నాని గెలవలేరేమో అని చర్చ రాలేదు…అదేవిధంగా 2009లో కూడా నాని సత్తా చాటారు. ఇక తర్వాత నాని వైసీపీలోకి వెళ్ళి పోటీ చేశారు..పైగా 2014లో టీడీపీ వేవ్ ఉంది..పవన్ కల్యాణ్ సైతం టీడీపీకి మద్ధతుగా నిలిచారు…ఇలాంటి సమయంలో కూడా నాని గెలుపుపై ఎవరికి డౌట్ లేదు. అనుకున్నట్లుగానే 2014లో కూడా గెలిచారు..2019 ఎన్నికల గురించి చెప్పాల్సిన పని లేదు…నాని గెలుస్తారని అనుకున్నారు…అలాగే గెలిచేశారు. పైగా మంత్రి కూడా అయ్యారు…తర్వాత మంత్రి పదవి పోయినా సరే…నాని దూసుకెళుతున్నారు.

ఇలా నాలుగుసార్లు డౌట్ లేకుండా గెలిచిన నాని…ఐదోసారి గుడివాడలో గెలవడానికి రెడీ అయ్యారు..కాకపోతే ప్రతిసారి మాదిరిగా..ఇప్పుడు లేదు..ఇంతకాలం నాని అధికారంలో లేరు కాబట్టి…ఆయన్ని అధికారంలోకి వచ్చేవరకు గెలిపించారు…మరి ఇప్పుడు అధికారంలో ఉన్నారు…పైగా కొంతకాలం మంత్రిగా పనిచేశారు. ఇలాంటి పరిస్తితుల్లో మళ్ళీ నానిని గుడివాడ ప్రజలు గెలిపిస్తారా? అంటే కాస్త కాన్ఫిడెంట్ గా చెప్పలేని పరిస్తితి…సొంత పార్టీ వాళ్లే నాని గెలుపు గురించి నమ్మకంతో ఉన్నట్లు కనిపించడం లేదు.

ఈ సారి ఏదో తేడా కొట్టేలా ఉందని వైసీపీ శ్రేణులే డౌట్ తో ఉన్నారు. కానీ అది డౌట్ మాత్రమే అని చెప్పాలి…గుడివాడలో టీడీపీ బలపడనంత కాలం కొడాలి నానికి తిరుగులేదనే చెప్పొచ్చు. ఎన్నికల నాటికి కూడా టీడీపీ పుంజుకోకపోతే ఐదోసారి నాని విజయం ఆపడం కష్టమే.