జగన్ ఫిక్స్: దర్శి సీటు బూచేపల్లికే?

నిదానంగా ప్రజా వ్యతిరేకత ఉన్న ఒక్కో సిట్టింగ్ ఎమ్మెల్యేకు జగన్ షాక్ ఇస్తూ వస్తున్నట్లు తెలుస్తోంది..వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేకు డైరక్ట్ గా చెప్పకుండా..పరోక్షంగా వారి స్థానాల్లో ఇంకో నాయకుడుగా ప్రాధాన్యత ఇస్తూ…వారికి నెక్స్ట్ సీటు ఉండదనే హింట్ ఇస్తున్నట్లు అర్ధమవుతుంది. ఇప్పటికే ప్రజల్లో తిరుగుతూ..వారి మద్ధతు పొందని ఎమ్మెల్యేలని నెక్స్ట్ సీటు ఇవ్వనని జగన్ చెప్పేశారు. అయితే జగన్ చెప్పాక కూడా కొందరు ఎమ్మెల్యేల గ్రాఫ్ పెరగడం లేదు.

దీంతో అలాంటి వారికి జగన్ నిదానంగా చెక్ పెట్టేస్తున్నారు. ఇప్పటికే తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని సైడ్ చేసినట్లే కనిపిస్తోంది…తాడికొండ అదనపు సమన్వయకర్తగా డొక్కా మాణిక్యవరప్రసాద్‌ని నియమించి…నెక్స్ట్ శ్రీదేవికి సీటు లేదని పరోక్షంగా చెప్పేశారు. శ్రీదేవి అనుచరులతో కలిసి నిరసన తెలియజేసిన ప్రయోజనం లేకుండా పోయింది. ఇదే క్రమంలో దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌పై ప్రజా వ్యతిరేకత ఎక్కువే ఉందని సర్వేలు వస్తున్నాయి.

పైగా అధికారంలో ఉండి కూడా దర్శి మున్సిపాలిటీని గెలిపించుకోలేకపోయారు…ఇదే మద్దిశెట్టికి పెద్ద మైనస్ అయింది. ఇక ఇదే క్రమంలో మద్దిశెట్టికి పోటీగా మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి సైతం దర్శిలో రాజకీయం చేస్తున్నారు…నెక్స్ట్ సీటు దక్కించుకోవాలని గట్టిగా ట్రై చేస్తున్నారు. నిజానికి 2014లో ఓడిపోయిన బూచేపల్లి…2019 ఎన్నికల్లో పోటీ చేయాలి. ఆర్ధిక కారణాలతో పోటీ చేయలేకపోయారు. ఈ సారి మాత్రం ఖచ్చితంగా దర్శి సీటు దక్కించుకోవాలని చూస్తున్నారు.

అయితే జగన్ కూడా బూచేపల్లిపై మొగ్గు చూపుతున్నారని అర్ధమవుతుంది. తాజాగా ఉమ్మడి ప్రకాశం జిల్లా చీమకుర్తిలో బూచేపల్లి ఆధ్వర్యంలో భారీ సభ జరిగింది…ఈ సభకు జగన్ హాజరయ్యారు. ఇక ఈ సభకు ప్రకాశం జిల్లాలోని ఎమ్మెల్యేలంతా వచ్చారు. కానీ మద్దిశెట్టి రాలేదు…ఎందుకంటే ఆయన్ని సభకు ఆహ్వాహించలేదట. దీని బట్టే అర్ధం చేసుకోవచ్చు…మద్దిశెట్టిని సైడ్ చేసి…బూచేపల్లికి దర్శిని అప్పజెప్పబోతున్నారని. మొత్తానికైతే దర్శి సీటు బూచేపల్లికే దక్కేలా ఉంది.