దగ్గుబాటి వారసుడు మళ్ళీ దూరమేనా?

ఏపీలో వారసత్వ రాజకీయాలు కొత్త కాదనే చెప్పాలి…అసలు ఏపీలో ఎక్కువ నడిచేది వారసత్వ రాజకీయమే..ఎవరికి వారు తమ వారసులని రాజకీయాల్లోకి తీసుకొచ్చి…సక్సెస్ చేయాలని సీనియర్ నేతలు ఎప్పుడు ట్రై చేస్తూనే ఉంటారు. ఇప్పటికే పలువురు నేతల వారసులు రాజకీయాల్లోకి సక్సెస్ అయ్యారు…మరికొందరు సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇలాంటి తరుణంలో సీనియర్ నేత దగ్గుబాటి వెంకటేశ్వరరావు వారసుడు దగ్గుబాటి హితేష్ చెంచురామ్ భవిష్యత్తుపై క్లారిటీ రావడం లేదు.

ఏపీ రాజకీయాల్లో దగ్గుబాటి ఫ్యామిలీకి ప్రత్యేక స్థానం ఉంది. ఎన్టీఆర్ పెద్ద అల్లుడు అయిన దగ్గుబాటి…మొదట్లో టీడీపీలో కీలకంగా పనిచేశారు…ఆ తర్వాత పార్టీ చంద్రబాబు చేతుల్లోకి వచ్చాక…ఆయనతో విభేదించి కాంగ్రెస్ లోకి వచ్చారు. కాంగ్రెస్ దగ్గుబాటి, అలాగే పురంధేశ్వరి కీలక నాయకులుగా పనిచేశారు. పురంధేశ్వరి కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు.  ఇక రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో పురంధేశ్వరి బీజేపీలోకి వచ్చారు..అటు దగ్గుబాటి రాజకీయాలకు దూరమయ్యారు.

అయితే 2019 ఎన్నికల్లో తమ వారసుడు హితేష్ కోసం దగ్గుబాటి వైసీపీలోకి వచ్చారు. కానీ హితేష్ విదేశీ పౌరసత్వం ముగియకపోవడంతో ఆయనకు పోటీ చేయడం కుదరలేదు. దీంతో దగ్గుబాటి డైరక్ట్ గా బరిలో దిగారు…పర్చూరులో దిగి పోటీ చేసి ఓడిపోయారు… ఎన్నికల తర్వాత దగ్గుబాటి మళ్ళీ రాజకీయాలకు దూరమైపోయారు.  అటు పురంధేశ్వరి బీజేపీలోనే రాజకీయం చేస్తూ వస్తున్నారు.

ఇక ఈ మధ్య దగ్గుబాటి, చంద్రబాబుల మధ్య సఖ్యత వచ్చింది. దీంతో దగ్గుబాటి వారసుడు టీడీపీలోకి వచ్చి చీరాలలో పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుంది. కానీ ఈ విషయంపై దగ్గుబాటి క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఆయన రాజకీయాలకు దూరం ఉంటేనే బెటర్ అని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అలాగే తన తనయుడుకు వ్యాపారాలు అప్పగించారు. అయితే బాబు డైరక్ట్ రంగంలోకి దిగితే పరిస్తితి మారే ఛాన్స్ ఉంది..లేదంటే దగ్గుబాటి వారసుడు రాజకీయాలకు దూరమైనట్లే.