చింతమనేనికి పవన్‌తో పనిలేదా?

ఏపీ రాజకీయాల్లో చింతమనేని ప్రభాకర్ అంటే ఫైర్ బ్రాండ్ నాయకుడు అనే సంగతి అందరికీ తెలిసిందే…ఈయన ఫైర్ ప్రత్యర్ధుల మీదే కాదు..అవసరమైతే సొంత పార్టీపై కూడా ఫైర్ అయ్యే సత్తా ఉన్న నేత చింతమనేని. అయితే రాజకీయంగా ఈయనకు బలం ఎక్కువే. కాకపోతే గత ఎన్నికల్లో కొన్ని రాజకీయ పరిస్తితుల నేపథ్యంలో చింతమనేని ఓటమి పాలయ్యారు.

- Advertisement -

వాస్తవానికి చింతమనేని నోటికి ఎక్కువ పనిచెబుతారు..దురుసుగా ప్రవర్తిస్తారు…కాంట్రవర్సీలో ఎక్కువ ఉంటారు అని చెప్పి ఎప్పుడు కథనాలు వస్తూనే ఉంటాయి. కానీ ఎంత దూకుడుగా ఉన్న తమ నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడు అండగా ఉంటారనే పేరు కూడా చింతమనేనికి ఉంది. అయితే అలాంటి నేత వరుసగా 2009, 2014లో గెలిచి, 2019లో ఓడిపోయారు.

వరుసగా ఆయన అనేక వివాదాల్లో చిక్కుకోవడం, వైసీపీని ఆయన్ని పూర్తిగా నెగిటివ్ చేయడం, జగన్ గాలి…ఈపరిణామాలు 2019 లో దెందులూరులో చింతమనేని ఓటమికి కారణమయ్యాయి. అయితే ఈ సారి మాత్రం ఎలాగైనా గెలవాలనే కసితో చింతమనేని పనిచేస్తున్నారు..ఎన్ని ఇబ్బందులు ఎదురైన ప్రజల కోసం నిలబడుతున్నారు…ఇప్పటికే ఆయన దెందులూరులో చాలావరకు బలం పెంచుకుంటున్నట్లు కనిపిస్తోంది.

అటు వైసీపీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరీకి ప్రస్తుతం పెద్దగా పాజిటివ్ కనిపించడం లేదు. ఈ పరిణామాల నేపథ్యంలో దెందులూరులో చింతమనేనికి కాస్త అనుకూల వాతావరణం వచ్చింది.  కాకపోతే జనసేన వల్లగాని ఇక్కడ చింతమనేనికి ఏమన్నా ఇబ్బంది ఉంటుందా? జనసేన సింగిల్ గా పోటీ చేస్తే చింతమనేని గెలుపు కష్టమవుతుందా? అంటే చింతమనేనిపై పవన్ ప్రభావం పెద్దగా ఉండదనే చెప్పొచ్చు.

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో పవన్ ప్రభావం ఉంది…కానీ దెందులూరు లాంటిస్థానాల్లో పెద్దగా ప్రభావం లేదు. గత ఎన్నికల్లో చింతమనేని 17 వేల ఓట్ల మెజారిటీతో ఓడిపోయారు. అప్పుడు జనసేనకు 6 వేల ఓట్లు మాత్రమే పడ్డాయి. అంటే దెందులూరులో జనసేన ప్రభావం ఎంత ఉందో అర్ధం చేసుకోవచ్చు. దీని బట్టి చూస్తే చింతమనేనికి పవన్ తో పెద్దగా పనిలేదనే చెప్పొచ్చు.

Share post:

Popular