బాలయ్యపై మంత్రి పోటీ?

రాష్ట్రంలో అధికార వైసీపీకి బలం ఉందనే సంగతి తెలిసిందే….గత ఎన్నికల్లో 151 సీట్లు గెలుచుకుని సత్తా చాటింది..తర్వాత అధికారంలోకి వచ్చాక జరిగిన అన్నీ ఎన్నికల్లో వన్ సైడ్ గా గెలిచేసి…రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో తమకు బలం ఉందని వైసీపీ నిరూపించుకుంది. ఆఖరికి కుప్పంలో కూడా సత్తా చాటిన విషయం తెలిసిందే…అందుకే జగన్ నెక్స్ట్ 175కి 175 సీట్లు గెలవాలని మాట్లాడుతున్నారు. అయితే 175 సీట్లు గెలవడం అనేది సాధ్యమైన పని కాదు…స్థానిక ఎన్నికల్లో గెలిచినంత మాత్రాన…సాధారణ ఎన్నికల్లో గెలిచేస్తారనేది జరిగే పని కాదు.

అయిన ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉంది..అలాగే కొన్ని టీడీపీ సిట్టింగ్ సీట్లలో వైసీపీ బలం ఏ మాత్రం పెరగలేదు. ముఖ్యంగా హిందూపురం లాంటి టీడీపీ కంచుకోటలో వైసీపీ ఏ మాత్రం పుంజుకోలేదు. మొదట నుంచి హిందూపురం టీడీపీకి కంచుకోట…ఇంతవరకు అక్కడ టీడీపీ ఓడిపోలేదు. కానీ అక్కడ టీడీపీని ఓడించాలని వైసీపీ ట్రై చేస్తుంది..బాలయ్యకు ఎలాగైనా చెక్ పెట్టాలని అనుకుంటుంది.

హిందూపురంలోని స్థానిక ఎన్నికల్లో వైసీపీనే గెలిచింది..కానీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచే పరిస్తితి లేదు. పైగా హిందూపురం వైసీపీలో అంతర్గత పోరు ఎక్కువ ఉంది. ఇక్కడ ఇంచార్జ్ గా ఉన్న ఎమ్మెల్సీ ఇక్బాల్‌ని..నవీన్, అబ్దుల్ ఘనీ వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి. తమకు ఇక్బాల్ ప్రాధాన్యత ఇవ్వడం లేదని అధిష్టానానికి ఫిర్యాదు కూడా చేశారు.

దీంతో నెక్స్ట్ తనకు జగన్ సీటు ఇవ్వనని చెబితే…తాను పోటీ నుంచి తప్పుకుంటానని ఇక్బాల్ మాట్లాడారు. అయితే పరిస్తితులని చూస్తుంటే నెక్స్ట్ హిందూపురం సీటు ఇక్బాల్ కు ఇచ్చేలా లేరు. ఈ సీటులో మంత్రి ఉషశ్రీచరణ్ పోటీ చేయొచ్చని కథనాలు వస్తున్నాయి. అదే సమయంలో మంత్రి ఉషశ్రీ ప్రాతినిధ్యం వహిస్తున్న కళ్యాణదుర్గం సీటుని మాజీ మంత్రి రఘువీరారెడ్డి కుమార్తెకు ఇచ్చే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతుంది. మరి ఈ ప్రచారం ఎంతవరకు నిజమవుతుందో…బాలయ్యపై ఎవరు పోటీ చేస్తారో చూడాలి.