అఖిలప్రియకు సెట్ అవ్వట్లేదా?

2019 ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత…చాలామంది టీడీపీ నాయకులు నిదానంగా పుంజుకుంటున్నారని చెప్పొచ్చు..గత ఏడాది కాలం నుంచి టీడీపీ నేతలు దూకుడుగా పనిచేయడం..అధికార వైసీపీ ఎమ్మెల్యే లపై వ్యతిరేకత పెరగడం లాంటి అంశాలు వల్ల…పలు నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు పికప్ అయ్యారు. ఇటీవల వస్తున్న సర్వేల్లో కూడా చాలా నియోజకవర్గాల్లో టీడీపీ పుంజుకుందని తెలుస్తోంది. అయితే ఇంకా పలుచోట్ల టీడీపీ పుంజుకోవాల్సిన అవసరం ఉంది.

అలా టీడీపీ పికప్ అవ్వాల్సిన స్థానాల్లో ఆళ్లగడ్డ కూడా ఒకటి అని చెప్పొచ్చు..భూమా ఫ్యామిలీ ఏ పార్టీలో ఉంటే…అక్కడ ఆ పార్టీ గెలిచేది. కానీ 2014 తర్వాత ఆళ్లగడ్డలో వైసీపీ హవా మొదలైంది. 2014 ఎన్నికల సమయంలోనే భూమా శోభా నాగిరెడ్డి ప్రమాదంలో మరణించారు. అప్పటికే నామినేషన్స్ అయిపోవడంతో…ఎన్నికలు జరిగిపోయాయి..అలాగే శోభానాగిరెడ్డి గెలిచారు. ఆ వెంటనే ఉపఎన్నిక రాగా, అప్పుడు వైసీపీ నుంచి భూమా అఖిలప్రియ ఏకగ్రీవంగా గెలిచారు.

అయితే తర్వాత తన తండ్రి నాగిరెడ్డితో కలిసి అఖిల టీడీపీలోకి వచ్చేశారు. అలాగే నాగిరెడ్డి చనిపోయాక…అఖిలకు మంత్రి పదవి కూడా దక్కింది. టీడీపీ అధికారంలో ఉన్నంత కాలం అఖిలకు ఆళ్లగడ్డలో తిరుగులేదనే పరిస్తితి. కానీ 2019 ఎన్నికల్లో సీన్ ఒక్కసారిగా మారిపోయింది…జగన్ వేవ్ లో అఖిల ఘోరంగా ఓడిపోయారు.

కానీ ఓడిపోయినా సరే ఆమె ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు…పార్టీకి అండగా ఉంటున్నారు..అయినా సరే ఆళ్లగడ్డలో అఖిల పుంజుకున్నట్లు కనిపించడం లేదు. ఇప్పటికీ అక్కడ వైసీపీ హవానే ఎక్కువ ఉన్నట్లు కనిపిస్తోంది. అంటే రెడ్డి వర్గం ఆధిక్యం ఉండటం వల్ల ఏమో గాని…ఆళ్లగడ్డలో వైసీపీ బలం తగ్గినట్లు కనిపించడం లేదు.

అటు ఎమ్మెల్యే బిజేంద్ర రెడ్డి పనితీరుపై నెగిటివ్ కామెంట్స్ కూడా పెద్దగా రావడం లేదు…ఆయనపై తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు కనిపించడం లేదు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆళ్లగడ్డలో అఖిల ఇంకా పైచేయి సాధించనట్లు లేరు…మరి ఎన్నికలనాటికి ఏమైనా సెట్ చేసుకుంటారేమో చూడాలి.

Share post:

Latest