ఇంట్రెస్టింగ్: బాలయ్యకు బింబిసార సినిమాకు సంబంధం ఏమిటి..!

తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోలు ఒకరైన నటసింహ నందమూరి బాలకృష్ణ ఎలాంటి పాత్రలోనైనా నటించగలరు. ఈ విషయం గురించి ప్రత్యేక్మగా చెప్పనవసరం లేదు. ఆయన చేసే పాత్రలు మరొకరు చేయలేరు. ఏ పాత్ర వేసిన పూర్తి స్థాయిలో న్యాయం చేస్తారు. పోయిన సంవత్సరం అఖండ సినిమాతో వచ్చిన బాలయ్య..సినీ ఇండస్ట్రీకి కొత్త ఊపును అందించారు. ఈ సినిమా ద్వార కెరియర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకున్నాడు. బాలయ్యే కాదు,RRR తో తారక్..బింబిసారతో కల్యాణ్ రామ్..ఇలా నందమూరి హీరోలు వరుస హిట్‌ల‌తో తెలుగు సినిమా పరిశ్రమలో దూసుకుపోతున్నారు.

 ఒకేతెరపై ఇద్దరు స్టార్స్‌ని చూడటం అంటే అంతకన్నా పెద్ద సంతోషం ఉంటుందా! అలాగే ఒకే ఫ్యామిలీకి చెందిన ఇద్దరు స్టార్స్ ఒక సినిమాకోసం కలిసి పని చేస్తే అంతకంటే వినోదం ఇంకేముంటుంది. తాజాగా ఇదే విషయంపై నందమూరి కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ పలు కీలకమైన పాయింట్స్ ప్రస్తావించారు.

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో సినిమాల హిట్‌లు లేక నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు నష్టపోతున్నారు. ఈ క్రమంలోనే నిర్మాతల మండలి సభ్యులు సినిమా షూటింగ్‌లు ఆపేయాలని వంటి షాకింగ్ నిరియాలు తీసుకుంటూ సినీ ఇండస్ట్రీని ఇంకా నష్టాలోకి నెట్టేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే బింబిసారా సినిమాతో టాలీవుడ్ కి అదిరిపోయే సూపర్ హిట్ ఇచ్చాడు కళ్యాణ్ రామ్. కొన్ని నెలలుగా హిట్‌లు లేని టాలీవుడ్ కు తన సినిమాతో మంచి బూస్టప్ ఇచ్చాడు ఈ హీరో. ఈ సినిమాను కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్లు ప్రొడ్యూసర్లు సినిమా రిలీజ్ మూడో రోజు నుంచే లాభాలబాట పట్టారు.Kalyan Ram enjoys Akhanda's 'mass'ive kick
అయితే ఈ క్రమంలో సోషల్ మీడియాలో బింబిసార పాత్ర గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయం నెట్టింట తెగ వైరల్ గా మారింది.బింబిసార పాత్రలో బాల‌య్య‌ నటిస్తే ఏ విధంగా ఉంటుందని చర్చ జరుగుతుంది. బాలయ్య విలన్ షేడ్స్ ఉన్న పాత్రలో సైతం అద్భుతంగా చేయగలడు.అయిన కోన్ని సినిమాల్లో కూడా విలన్ టైప్ క్యారెక్టర్లు కూడా చేశారు. ఆయన సుల్తాన్ సినిమాలో నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో నటించి అందరిని మెప్పించారు. ఒక్కవేళ బింబిసార‌ సినిమాలో ఆయన నటించి ఉంటే ఈ సినిమా స్థాయి మరింత పెరిగి ఉండేదని సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు నందమూరి కళ్యాణ్ రామ్ సినీ కెరియర్ లోనే ఈ సినిమా బిగ్గెస్ట్ బాక్ల్ బాస్టర్ హిట్‌గా నిలిచింది. కళ్యాణ్ రామ్ నటించిన కొన్ని సినిమాలు సక్సెస్ అయిన ఈ సినిమాకు వచ్చిన కలెక్షను ఆ సినిమాలు రాబట్టలేకపోయాయి. ఈ సినిమాకు టోటల్‌గా 50 కోట్ల గ్రాస్ 40 కోట్ల కలెక్షన్లు వస్తుందని టాలీవుడ్ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Share post:

Latest