షాక్‌… ‘ లైగ‌ర్‌ ‘ కు హిందీలో బంప‌ర్ క‌లెక్ష‌న్లు…!

టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ హీరో విజయ్ దేవరకొండ కాంబోలో వచ్చిన సినిమా లైగ‌ర్ ఈనెల 25న ప్రేక్షకులు ముందుకు వచ్చింది. విడుదలైన మొదటి ఆట నుంచి భారీ డిజాస్టర్ టాక్‌ను సొంతం చేసుకుంది. తెలుగు స్టేట్స్ లో అయితే ఈ సినిమా ఎవరు చూడడానికి కూడా ఇష్టపడతలేదు. విచిత్రం ఏంటంటే ఈ సినిమా సౌత్‌లో కన్నా హిందీలో ఈ సినిమాకి కలెక్షన్లు కొంచెం పర్లేదు అనిపిస్తున్నాయి. మొదటి రోజుతో పోల్చుకుంటే మూడవ రోజు కూడా ఈ సినిమాకు కలెక్షన్లు సమాంతరంగా వస్తున్నడువిశేషం.

ఈ సినిమా హిందీలో ఒక్కరోజు ఆలస్యంగా రిలీజ్ అయింది. అప‌టికే ఈ సినిమా భారీ డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. హిందీ ఆడియన్స్ మాత్రం ఈ సినిమాకు కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నారు. మొదటిరోజు ఆ సినిమాకు నార్త్‌లో 5.75 కోట్లు వచ్చింది. ఇంత భారీ డిజాస్టర్ టాక్‌ తెచ్చుకున్నా హిందీలో ఈ సినిమాకు ఇంత భారీ కలెక్షన్లు రాబట్ట‌డం అందరిని ఆశ్చర్యాన్ని గురిచేస్తుంది. శనివారం ఒక్కరోజే హిందీలో ఈ సినిమాకి 4.10 కోట్ల నుంచి 4.50 కోట్ల వరకు కలెక్షన్లు వ‌చ్చాయి.

ఓవ‌రాల్‌గా మూడు రోజుల‌కు హిందీ వెర్ష‌న్‌లో ప్రపంచవ్యాప్తంగా 10. 25 కోట్ల నెట్‌ కలెక్షన్లు రాబట్టింది అని బాలీవుడ్ మీడియా చెప్పుకొచ్చింది. ఈ సినిమాకి తెలుగులో రాష్ట్రాల్లో భారీ నష్టాలు తప్పవంటున్నా హిందీ వ‌సూళ్లు మాత్రం ఊర‌ట‌నిచ్చేలా ఉన్నాయి.

Share post:

Latest