ఫోటోగ్రాఫ్స్ పై హీరో సూర్య సీరియస్.. కారణం తెలిస్తే కరెక్టే కదా అంటారు!

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. తమిళ తంబీలు సూర్య అంటే కోసుకుంటారు. ఇక ఈమధ్య వచ్చిన సినిమా ‘విక్రమ్’లో రోలెక్స్ పాత్రతో పాన్ ఇండియా లో ఫేమస్ అయ్యారు సూర్య. అలాగే అటుపై ‘ఆకాశం నీ హద్దురా’ చిత్రంతో ఏకంగా జాతీయ అవార్డుని సొంతం చేసుకున్నాడు. ఈ రెండు ఒకేసారి జరగడంతో సూర్య రేంజ్ బాగా పెరిగిపోతుంది. ఇక సూర్య కళ్లని అభిమానులు ప్రత్యేకించి కీర్తిస్తుంటారు. పబ్లిక్ గానే సూర్య ఐస్ గురించి మాట్లాడుతూ వుంటారు. ఇటీవలే ప్రభాస్ సైతం సూర్య కళ్లని ఓ రేంజ్ లో మెచ్చుకున్న సంగతి విదితమే.

కళ్లతోనే యాక్టింగ్ చేసే స్టార్స్ లో హీరో సూర్య ఒకరు. ఇకపోతే సూర్య – జ్యోతిక జంటకు దియా – దేవ్ అనే ఇద్దరు పిల్లలు వున్నారు. కుటుంబమంటే? సూర్యకి మరో ప్రపంచం అని చెప్పుకోవాలి. ఖాళీ సమయాన్ని కుటుంబానికే కేటాయిస్తారు. తాజాగా ఈ జంట పిల్లలుతో కలిసి ముంబై వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడ ఓ రెస్టారెంట్లో భోజనం తర్వాత మీడియాకి చిక్కారు. రెస్టారెంట్ నుంచి బయటకు వచ్చ సమయంలో ఫోటోగ్రాఫర్లు ఒకరి తరువాత ఒకరు దాడి చేసారు. వాళ్ల బాధని అర్ధం చేసుకున్న దంపతులు ఇద్దరు కలిసి కొన్ని ఫోటోలు ఇచ్చారు. పిల్లలు దేవ్-దియాల్ని కూడా ఫోటో గ్రాఫర్లు కవర్ చేయబోయారు.

దీంతో సూర్య దానికి అభ్యంతరం వ్యక్తం చేసారు. పిల్లల ఫోటోలు తీయొద్దని ఫోటోగ్రాఫర్లని సున్నితంగా హెచ్చరించారు. అయినా వారు ఫోటోలు తీయడం ఆపలేదు. దీంతో సూర్య వాళ్లపై ఒకింత అసహనాన్ని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇకపోతే పిల్లల పేర్లపై సూర్య ఓ బ్యానర్ కూడా స్థాపించి సినిమాలు నిర్మిస్తున్నారు. ఛారిటీ పౌండేషన్ స్థాపించి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ దియా-దేవ్ లపై మాత్రం అప్పుడే సినిమా-మీడియా అనే ముద్ర పడకుండా ముందు జాగ్రత్తగానే ఇలాంటి చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

Share post:

Latest