రౌడీ ఫ్యాన్స్ కి బీపి తెప్పిస్తున్న నాని ట్వీట్..ఎంత ధైర్యం సామీ నీకు..!?

తెలుగు చిత్ర పరిశ్రమలో ఎప్పుడో లేనంతగా జూన్- జూలై నెలలో వచ్చిన సినిమాలు అట్టర్ ప్లాఫ్ అవ్వగా ఒక్క సినిమా కూడా ఇండస్ట్రీ హిట్ అవ్య‌లేదు. జూన్‌లో డైరెక్టు సినిమా మేజ‌ర్‌, క‌మ‌ల్ డ‌బ్బింగ్ మూవీ విక్ర‌మ్ మాత్రమే హిట్‌. ఆ త‌ర్వాత జూన్‌, జూలై అన్ని సినిమాలు ప్లాపులే. పై రెండు సినిమాలు వ‌దిలేస్తే నిర్మాతలకు లాభాలు తీసుకువ‌చిన‌ సినిమా ఒకటి కూడా లేదు.

ఆగస్టు నెల మొదటిలో రిలీజ్ అయిన బింబిసారా- సీతారామం సినిమాలు ఆల్ టైం ఇండస్ట్రీ హిట్లుగా నిలిచాయి. నిర్మాతలకు ఎప్పుడు లేనంతగా లాభాలు తీసుకొచ్చి పెట్టాయి. అందరి చూపు ఈ నెలలో ఈ రోజు రిలీజ్ అయిన పాన్ ఇండియా సినిమా లైగర్ సినిమా మీదే ఉంది. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అవుతుందని సోషల్ మీడియా వేదిక సెలబ్రిటీలు అభిమానులు పోస్టులుపెడుతున్నారు.

Tollywood: Nani clears rumors on Tuck Jagdish

తాజాగా ఈ సినిమాపై నేచురల్ స్టార్ నాని తన ట్వీటర్ వేదిక పోస్ట్‌ పెట్టాడు. సినిమా హిట్ అవ్వాల‌ని నాని కోర‌గా… విజ‌య్ కూడా త‌మ అనుబంధం గురించి చెపుతూ రిప్లే ఇచ్చాడు. ఈ పోస్ట్ ఇక సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నాని- విజయ్ దేవరకొండ గతంలో ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో కలిసి నటించిన విషయం తెలిసిందే. ఇద్దరి మధ్య మంచి స్నేహం కూడా ఉంది. కానీ నాని- అభిమానులకి -విజయ అభిమానులకి మధ్య పచ్చి గడ్డి వేస్తే భ‌గ్గుమనేంత శత్రుత్వం ఉంది.

 

Share post:

Latest