అన్‌స్టాప‌బుల్ 2కు బాల‌య్య రేటు పెరిగిందా..!

నందమూరి బాలకృష్ణ కేవలం మాస్ హీరోగా మాత్రమే కాకుండా యాక్షన్ హీరోగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇకపోతే ఐదు పదుల వయసు దాటినప్పటికీ ఆయన అంతే స్పీడుతో సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతూ ఉండడం గమనార్హం. ఇకపోతే బాలయ్య బాబు ఈ వయసులో కూడా కోట్లు కొల్లగొట్టే సినిమాలు చేస్తూ సరికొత్త రికార్డులను నెలకొంటున్నారు. ఇక మరొకవైపు రాజకీయంగా కూడా చెరగని ముద్ర వేసుకున్న బాలయ్యకు అలాగే ఆయన మంచితనానికి ప్రతి ఒక్కరూ ఫిదా అవుతూ ఉంటారు. ఇకపోతే సినీ ఇండస్ట్రీకి రాజకీయ రంగానికే పరిమితమైన బాలయ్య ఎప్పుడూ కూడా బుల్లితెరపై అడుగుపెట్టలేదు .కానీ మొట్టమొదటిసారి ఆహా ప్రముఖ ఓటీటి కోసం వ్యాఖ్యాతగా మారాల్సి వచ్చింది.Watch Unstoppable Web Series Online in HD Quality - Ahaఅన్ స్టాపబుల్ విత్ ఎన్బికె కార్యక్రమం ద్వారా పలువురు సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేస్తూ వారి వ్యక్తిగత విషయాలను కూడా ప్రేక్షకులకు తెలియజేశారు బాలయ్య. ముఖ్యంగా ఆయన కటౌట్ కి బాడీ లాంగ్వేజ్ కి ప్రతి ఒక్కరు కూడా ఫిదా అయ్యారు .మొదట్లో బాలయ్య బాబు చేయగలరా ? అనే అనుమానాలు ప్రతి ఒక్కరిలో ఉన్నా.. ఆయన మాత్రం చాలా అద్భుతంగా పనిచేశారు అని చెప్పవచ్చు. ఇకపోతే బాలయ్య బాబు డెడికేషన్ కి ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు. ఇక ఇండియాలోనే నెంబర్ వన్ టాక్ షో గా గుర్తింపు తెచ్చుకుంది ఈ షో. ఇక ఇదిలా ఉండగా త్వరలోనే అన్ స్టాపబుల్ విత్ ఎన్బికె సీజన్ టు ప్రారంభమవుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సీజన్ 2 కోసం బాలయ్య బాబు కూడా తన పారితోషకం పెంచాడు అనే వార్తలు గతంలో వైరల్ అయ్యాయి.Balakrishna's Talk Show 'Unstoppable With NBK' Surpasses 4 Million Views On OTT

- Advertisement -

ఇక ఈ క్రమంలోనే ప్రముఖ ఆహా ఓటీపీ నిర్మాకులైన అల్లు అరవింద్ మరొకసారి తమ ఓటీటీకి మంచి ఇమేజ్ రావడం కోసమే బాలయ్య బాబు అడిగినంత పారితోషకం ఇవ్వడానికి సిద్ధమయ్యారు అని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే గతంలో బుల్లితెరపై అవగాహన లేక కేవలం రూ.2.5 కోట్లు మాత్రమే తీసుకొని హోస్టుగా పనిచేశారు. కానీ ఇప్పుడు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు అనేది మాత్రం ప్రశ్నార్థకంగానే మారిపోయింది. ఇక ప్రస్తుతం బాలయ్య గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్న సినిమా షూటింగ్లో పాల్గొంటున్నారు. ఇక త్వరలోనే అన్ స్టాపబుల్ షో కి డేట్ లు కేటాయించి పారితోషకాన్ని నిర్ణయిస్తారు అని సమాచారం.

Share post:

Popular