క్యాస్ట్ పాలిటిక్స్: గోరంట్లకు సపోర్ట్?

ఇటీవల వైసీపీ ఎంపీ గోరంట్ల మధ్య న్యూడ్ వీడియో కాల్ వ్యవహారం రాష్ట్రంలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఆ వీడియో వ్యవహారంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి..ప్రతిపక్ష పార్టీల నుంచే కాకుండా…న్యూట్రల్ వర్గాల నుంచి సైతం..వైసీపీ ఎంపీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఆ వీడియోని మార్ఫింగ్ చేశారని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశానని, దీని వెనుక టీడీపీ నేతలు ఉన్నారని మాధవ్ ఆరోపించిన విషయం తెలిసిందే.

ఇదే సమయంలో వీడియో వ్యవహారంలో తప్పు ఉందని తేలితే…మాధవ్ పై చర్యలు తీసుకుంటామని వైసీపీ నేతలు చెబుతున్నారు. కాకపోతే వీడియో వచ్చిన నెక్స్ట్ డే ఆయనపై చర్యలు తీసుకోవచ్చని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ ఏం జరిగిందో ఏమో గాని…ఆయనపై వేటు వేసే విషయంలో వైసీపీ అధిష్టానం ఆచితూచి వ్యవహరిస్తుంది.

ఇలా వైసీపీ అధిష్టానం మాధవ్ విషయంలో కాస్త స్లో గా ముందుకెళ్లడానికి కారణం…మాధవ్ కులమే కారణమని కథనాలు వస్తున్నాయి. రాయలసీమలో అతి పెద్ద సామాజికవర్గమైన కురుబ కులానికి చెందిన నేత మాధవ్. ఆయనకు ఇప్పుడు ఆ కులం వారు ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు…మాధవ్ పై కావాలని కుట్ర చేశారని, ఇదంతా టీడీపీ కమ్మ నేతల పనే అని రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు.

తాజాగా అనంతపురంలో చంద్రబాబు, లోకేష్‌ బ్యానర్లతో కమ్మవర్గానికి వ్యతిరేకంగా కురబల ర్యాలీ జరిగింది. అటు కమ్మ కులం నేతలు కూడా…కురుబ కులానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు. ఇలా మాధవ్ వ్యవహారం కాస్త కులాల మధ్య కుంపటిగా తయారైంది. ఇక మాధవ్ న్యూడ్ వీడియో వ్యవహారంలో ఆయనకు…తన కులం సపోర్ట్ బాగానే దక్కింది. అందుకే మాధవ్ పై చర్యలు తీసుకునే విషయంలో వైసీపీ అధిష్టానం వెనుకడుగు వేస్తుందని ప్రచారం జరుగుతుంది. మొత్తానికి మాధవ్ వ్యవహారంలో కులాల చిచ్చు రాజేసుకుంది. మరి మాధవ్ వీడియో నిజమో కాదో…ఎప్పుడు తేలుతుందో చూడాలి.

Share post:

Latest