కృష్ణాలో ఆ నలుగురికి సీటు డౌటే!

వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు…అందులో సగం మంది ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత ఉందని, నెక్స్ట్ ఎన్నికల్లో 70 మందికి సీట్లు ఇస్తే వైసీపీ గెలవడం కష్టమని చెప్పి పీకే టీం సర్వే చేసి..ఆ నివేదికని జగన్‌కు ఇచ్చిందని టీడీపీ అనుకూల మీడియాలో ఓ కథనం వచ్చింది. అయితే ఈ కథనంలో ఎంతవరకు నిజముందో తెలియదు గాని..ఈ కథనాన్ని చూసి కొందరు వైసీపీ నేతలు టెన్షన్ పడుతున్నారని మాత్రం తెలుస్తోంది. ఎందుకంటే వ్యతిరేకత ఎదురుకుంటున్న ఎమ్మెల్యేల స్థానాలని సైతం టీడీపీ అనుకూల మీడియా ప్రచురించింది.

కాకపోతే ఇది టీడీపీ మీడియా కథనం వరకే పరిమితమైతే పర్లేదు…కానీ తాజాగా జగన్ తీసుకున్న నిర్ణయం…టీడీపీ మీడియా ప్రచారాన్ని నిజం చేస్తుంది…తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవికి చెక్ పెడుతూ…ఆ నియోజకవర్గంలో అదనపు సమన్వయకర్తగా డొక్కా మాణిక్యవరప్రసాద్‌ని నియమించారు. శ్రీవిపై వ్యతిరేకత ఉందని మొదట నుంచి ప్రచారం జరుగుతుంది.

నెక్స్ట్ ఆమెకు సీటు దక్కడం కూడా కష్టమే అని ప్రచారం ఉంది…ఇలాంటి సమయంలో జగన్ తీసుకున్న నిర్ణయం కొందరు ఎమ్మెల్యేలని టెన్షన్ పెడుతుంది…పైగా వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలు ఉన్న చోట అదనపు సమన్వయకర్తలని నియమించడానికి జగన్ సిద్ధమవుతున్నారని టీడీపీ మీడియాలో ప్రచారం వచ్చింది. ఇప్పటికే తాడికొండలో డెసిషన్ తీసుకున్నారు. దీంతో మిగతా ఎమ్మెల్యేలు టెన్షన్ పడుతున్నారు.

ఇదే క్రమంలో కృష్ణా జిల్లాలో నాలుగు స్థానాలు ఉన్నాయని మీడియాలో కథనం వచ్చింది…విజయవాడ పశ్చిమ, పెనమలూరు, అవనిగడ్డ, మైలవరం స్థానాల్లో అదనపు సమన్వయకర్తలని పెట్టొచ్చని కథనం వచ్చింది. అంటే నెక్స్ట్ వెల్లంపల్లి శ్రీనివాస్, పార్థసారథి, సింహాద్రి రమేశ్, వసంత కృష్ణప్రసాద్‌లకు సీటు డౌటే అని ప్రచారం వస్తుంది. అయితే ఇప్పటికే కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావుకు నెక్స్ట్ ఛాన్స్ లేదని కృష్ణా జిల్లాలో ప్రచారం జరుగుతుంది. చూడాలి మరి నెక్స్ట్ కృష్ణాలో ఎంతమందికి సీటు రాదో.

Share post:

Latest