పశ్చిమలో ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యేల కష్టాలు!

రాజకీయాల్లో విజయం సాధించడం ఎంత కష్టమో…ఆ విజయాన్ని నిలబెట్టుకోవడం అంతకంటే కష్టమని చెప్పొచ్చు. ఎంతో కష్టపడితే గాని విజయాలు దక్కవు. అలాంటి విజయాలు వచ్చినప్పుడు కష్టపడి పనిచేసి ప్రజలకు అండగా నిలిచి..మళ్ళీ గెలిచేలా పనిచేయాలి. అలా చేయకపోతే ఒకసారి గెలుపుకే పరిమితమవుతారు. ఇప్పుడు ఏపీలో ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యేలకు అదే పరిస్తితి ఉంది…గత ఎన్నికల్లో 175 సీట్లలో దాదాపు 70 మంది తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచినవారు ఉన్నారు. అందులో 67 మంది వైసీపీ నుంచి గెలిచిన వారే.

జగన్ వేవ్‌లో 67 మంది తొలిసారి గెలిచారు…ఇక ఇలా తొలిసారి గెలిచిన వారు…చాలా బాధ్యతగా పనిచేయాలి..ప్రజలకు అండగా నిలబడాలి. మళ్ళీ గెలిచేలా పనులు చేయాలి. కానీ ఇందులో చాలామంది అలా చేయడం లేదు. దీని వల్ల చాలామంది ప్రజా వ్యతిరేకతని ఎదురుకుంటున్నారు. జగన్ ఇమేజ్‌తో గెలిచినవారు ఎలాగోలా సొంత ఇమేజ్ పెంచుకుంటే ఇబ్బందులు ఉండేవి కాదు.

కానీ కొందరు ఎమ్మెల్యేలు సొంత ఇమేజ్ పెంచుకోలేదు…దీని వల్ల పలువురు ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యేలకు సెకండ్ టైమ్ గెలిచే అవకాశాలు కనిపించడం లేదు…అలాగే కొందరికి అసలు సీటు కూడా దక్కేలా లేదు. వీరిలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యేలకు కష్టాలు ఎక్కువగా ఉన్నాయి. గత ఎన్నికల్లో జిల్లాలో ఫస్ట్ టైమ్ గెలిచినవారు…భీమవరంలో గ్రంథి శ్రీనివాస్, ఉంగుటూరులో పుప్పాల శ్రీనివాస్, నిడదవోలులో శ్రీనివాస్ నాయుడు, దెందులూరులో అబ్బయ్య చౌదరీ, చింతలపూడిలో ఎలిజా, గోపాలాపురంలో తలారి వెంకట్రావు…వీరు తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచారు.

ఇక వీరిలో మళ్ళీ ఎవరికి సీటు వస్తుందో తెలియడం లేదు..అలాగే సీటు వచ్చిన గెలుస్తారా? లేదా? అనేది పెద్ద డౌట్ గా ఉంది. ఉంగుటూరు, చింతలపూడి ఎమ్మెల్యేలకు సీటు డౌటే అని ప్రచారం జరుగుతుంది. గెలుపు విషయానికొస్తే…టీడీపీ-జనసేన గాని కలిసి పోటీ చేస్తే…వీరిలో ఎవరికి పెద్దగా గెలుపు అవకాశాలు కనిపించడం లేదు. మొత్తానికి ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యేలకు కష్టాలు ఎక్కువగానే ఉన్నాయి.