ఆ అవమానాన్ని తట్టుకోలేక ఏడేళ్లపాటు అజ్ఞాతంలో గడిపిన హీరో ఎవరో తెలుసా?

సినిమా జీవితం అంటే అదేదో మనం చాలా తేలికగా ఊహించేసుకున్న రంగులమయం జీవితం కాదు. ఆ జీవితం వెనుక ఎన్నో కన్నీళ్లు కష్టాలు ఉంటాయి. సినీ తారల జీవితాలలో ఎన్నో ఎత్తుపల్లాలు ఉంటాయి. డబ్బైతే సంపాదిస్తారు కానీ, అనుభవించేది మాత్రం శూన్యమే అని చెప్పుకోవాలి. ఇకపోతే తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి పుష్ప సినిమాతో ఎంట్రీ ఇచ్చి మంచి పేరు సంపాదించుకున్నాడు మలయాళ హీరో ఫహద్ ఫాజిల్. ఆ తర్వాత తమిళ సినిమా విక్రమ్ సినిమాలో నటించి మంచి ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు ఈ నటుడు.

మలయాళంలో ఎన్నో సినిమాలలో హీరోగా నటించి మంచి విజయాలను అందుకోవడమే కాకుండా, జాతీయ అవార్డును కూడా అందుకున్నాడు ఫహద్ ఫాజిల్. ఫహద్ ఫాజిల్ సినీ బ్యాగ్రౌండ్ ఉన్న నేపథ్య కుటుంబం నుండి వచ్చాడు. ఈయన తండ్రి కూడా ఒక పెద్ద డైరెక్టర్ కావడంతో హీరో అయ్యేందుకు చాలా ఆత్రుత చూపాడు. డిగ్రీ చదువుతున్న సమయంలో 19 ఏళ్లకే ముఖానికి మేకప్ వేసుకొని 2002లో మొదటి చిత్రం ‘కైమేథూమ్ దురత్’ అనే సినిమాలో నటించారు. ఈ సినిమాకి తన తండ్రి డైరెక్షన్ వహించాడు. మమ్ముట్టి ఈ సినిమాలో గెస్ట్ రోల్ గా పని చేశారు.

ఇక సహజంగానే ఈ సినిమా పై హైప్ భారీగా పెరిగిపోయింది. కానీ ఈ సినిమా భారీ డిజాస్టర్ ని మూటకట్టుకుంది. దీంతో ఈ హీరో పై పలు విమర్శలు వెల్లువెత్తాయి. అంతేకాకుండా ఈ హీరో ఏంటి బొమ్మలాగా ఉన్నాడని కామెంట్లు వచ్చాయి. ఈ విమర్శలను విని తట్టుకోలేక యాక్టింగ్ వదిలేసి అమెరికాకు వెళ్లిపోయాడు మన హీరో. అలా USAకి వెళ్ళిపోయి దాదాపు 7సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చాడు ఫహద్ ఫాజిల్. ఆ తర్వాత తన తండ్రి ప్రోత్సాహంతో డైరెక్టర్ రంజిత్ డైరెక్షన్లో ‘కేరళ కెఫ్’ అనే సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. ఇక ఈ సినిమాతో వెనక్కి తిరిగి చూసుకోలేదు ఫహద్ ఫాజిల్.

Share post:

Latest