అక్కాచెల్లెళ్లతో కలిసి నటించిన ఏకైక స్టార్ హీరో ఎవరో తెలుసా..?

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లు తండ్రి కొడుకులతో రొమాన్స్ చేసిన సందర్భాలు మనం చాలానే చూసాము.. ఒకసారి తండ్రి సినిమాలో నటిస్తే .. మరొకసారి కొడుకు సినిమాలో నటించి ఇలా ప్రేక్షకులను ఎంతోమంది అలరించారు. కానీ అక్కా చెల్లెళ్లతో కలిసి నటించిన ఏకైక స్టార్ హీరో ఒకరు ఉన్నారు . ఆయన ఎవరో కాదు మెగాస్టార్ చిరంజీవి. రాధిక, నిరోష, జ్యోతిక , రోషిని, నగ్మా వంటి అక్కాచెల్లెళ్లతో నటించిన ఏకైక హీరోగా మెగాస్టార్ చిరంజీవి రికార్డ్ సృష్టించడం గమనార్హం. ఇక ఆ సినిమాల విషయానికొస్తే.. క్రాంతి కుమార్ నిర్మాణ సారధ్యంలో డైరెక్టర్ కోదండరామిరెడ్డి డైరెక్షన్లో చిరంజీవి హీరోగా, రాధిక హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం న్యాయం కావాలి .ఇక ఈ సినిమాతోనే మొదటిసారి కోదండరామిరెడ్డి, చిరంజీవి, రాధిక కాంబినేషన్ తెలుగు తెరకు పరిచయమయ్యింది .ఇక అలా మొదలైన వీరిద్దరి కాంబినేషన్ 1990 వరకు కొనసాగిందని చెప్పవచ్చు.Watch Gappu Gappu Song Video | Listen to Gappu Gappu Song Online for Free  on MX Player.inచిరంజీవి – రాధిక కాంబినేషన్లో కిరాయి రౌడీలు, పట్నం వచ్చిన పతివ్రతలు, ప్రేమ పిచ్చోళ్ళు, పులి బొబ్బిలి, శివుడు శివుడు శివుడు , గూడచారి నంబర్ వన్, జ్వాల, అభిలాష, ఊరికి మొనగాడు ఇలా ఎన్నో చిత్రాలలో వీరిద్దరూ కలిసి నటించారు. అప్పట్లో వీరిద్దరి కాంబినేషన్ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉండేది. ఇకపోతే 1988లో డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో ఒక తమిళ సినిమా చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైంది రాధిక చెల్లెలు నిరోషా.Gharana Mogudu Full Movie - Part 7-13 - Chiranjeevi, Nagma, Vani Viswanath  - HD - video Dailymotion

ఇక ఈమె మహా జనానికి మరదలు పిల్ల , బుజ్జిగాడు బాబోయ్, వన్ బై టు, భలే ఖైదీలు వంటి చిత్రాలలో నటించింది. 1991 లో క్రియేటివ్ కమర్షియల్ నిర్మాత ఎస్ రామారావు నిర్మాణ సారధ్యంలో.. యండ మూర్తి వీరేంద్రనాథ్ డైరెక్షన్ లో స్టువర్టపురం పోలీస్ స్టేషన్ సినిమా విడుదల అయింది .ఇక ఈ సినిమాలో చిరంజీవి, నిరోష, విజయశాంతి హీరో హీరోయిన్లుగా నటించారు. అలా రాధిక , రాధిక చెల్లెలు నిరోషాతో చిరంజీవి నటించడం జరిగింది.Chiranjeevi And Roshini Lovable Scene || Telugu Latest Movies || Super Hit  Movies - YouTubeఇక నగ్మా సిస్టర్ విషయానికి వస్తే.. చిరంజీవి నగ్మాతో ఘరానా మొగుడు, జ్యోతిక తో ఠాగూర్, రోషినితో మాస్టర్ సినిమాలో నటించాడు. ఇలా ఈ అందరి అక్కచెల్లెళ్లతో నటించిన ఏకైక హీరోగా మెగాస్టార్ చిరంజీవి గుర్తింపు తెచ్చుకున్నారు.

Share post:

Latest