మంత్రి రోజా ఐటమ్ సాంగ్లో నటించిన చిత్రం ఏంటో తెలుసా..?

ఒకప్పుడు ప్రముఖ స్టార్ హీరోయిన్గా చలామణి అయిన ఆర్కే రోజా ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది. ఇక ఈమె స్టార్ హీరోల సినిమాలలో హీరోయిన్గా నటించడమే కాకుండా లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో కూడా ప్రేక్షకులను మెప్పించింది అని చెప్పవచ్చు. ముఖ్యంగా చాలామంది తమ సినీ కెరియర్ డౌన్ అవుతున్న సమయంలో సినీ ఇండస్ట్రీకి దూరం అవుతూ కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగి సినీ ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇస్తూ ఉంటారు. కానీ రోజా మాత్రం ఇండస్ట్రీకి దూరం కాకుండా.. వెండితెరపై మెరిసిన ఈమె ఆ తర్వాత బుల్లితెరపై తన ప్రస్థానాన్ని కొనసాగించింది.This is how actress Roja helped a stranded pregnant woman to get to a  hospital for giving birth | Tamil Movie News - Times of Indiaజబర్దస్త్ కామెడీ కార్యక్రమానికి 9 సంవత్సరాల పాటు నిర్విరామంగా జడ్జిగా వ్యవహరించిన విషయం తెలిసిందే.కేవలం సినిమాల పరంగా కాకుండా రాజకీయంగా కూడా తన చెరగని ముద్రను వేసుకుంది. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే ఈ స్థాయిలో రాష్ట్ర రాజకీయాల్లో దక్షిణాదిలో చక్రం తెప్పిన వారు జయలలిత తర్వాత రోజా అనే చెప్పాలి. ఇక పట్టుదలతో ఈమె మూడోసారి కూడా ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతూ ఉండడం గమనార్హం.

ఇకపోతే ఈమె కూడా గతంలో ఒక ఐటమ్ సాంగ్ లో నటించిన విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అది కూడా హిందీ సినిమాలో ఐటమ్ సాంగ్ లో నటించడం చాలా ఆశ్చర్యకరం. దాదాపు మూడు దశాబ్దాల సినీ కెరియర్లో ఆలియా భట్ తండ్రి మహేష్ భట్ దర్శకత్వంలో అల్లు అరవింద్ నిర్మాణంలో చిరంజీవి హీరోగా నటించిన ది జెంటిల్మెన్ సినిమాలో.. రోజా ఐటమ్ సాంగ్ లో మెరిసింది. ముఖ్యంగా తెలుగులో ప్రభుదేవా చేసిన చికుబుకు రైలే పాటను హిందీలో చిరంజీవి చేశారు. ఇక సౌత్లో గౌతమి ఐటమ్ సాంగ్ లో నటించిగా.. హిందీలో రోజా ఐటెం సాంగ్ లో చిందేసింది. ఇక అంతకుముందు నాగార్జున హీరోగా వచ్చిన రక్షణ సినిమా, ఆ తర్వాత హలో బ్రదర్ సినిమాలో కూడా ఈమె ఐటమ్ సాంగ్ లో మెరవడం జరిగింది.

Share post:

Latest