దిల్ రాజుకి దూల తీరిపోయే రోజు అదే..భళే ఇరుక్కున్నాడే..!?

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బ్లాస్టింగ్ డైరెక్టర్ శంకర్ కాంబోలో రాబోతున్న సినిమానే RC15. అయితే, ఈ సినిమాకి బ్రేకులు పడట్లు తెలుస్తుంది. దానికి కారణం శంకర్.. కమలహాసన్ ఇండియన్ 2 మూవీ కోసం RC 15 సినిమా షూటింగ్ కి బ్రేక్ వేశాడట. రామ్ చరణ్ చిత్రానికి కొంత గ్యాప్ ఇచ్చాడు శంకర్ అంటూ న్యూస్ వైరల్ గా మారింది. అయితే ఇక్కడ మరో పెద్ద సమస్య వచ్చి పడింది. నిజానికి RC 15 సినిమాకి ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్న రామకృష్ణ కొన్ని నెలల ముందే సినిమా నుంచి తప్పుకున్నట్లు న్యూస్ వైరల్ అయ్యాయి. RC15 షూటింగ్ టైం ప్రకారం జరగట్లేదని ..సెట్లో ఆయనకి గౌరవం ఇవ్వట్లేదని ..కోపగించుకుని రామకృష్ణ సినిమా నుంచి తప్పుకున్నాడట. ఆయన ప్లేస్ లోకి మరో ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ రెడ్డి వచ్చారు.

అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారంరవీందర్ కూడా ఈ సినిమా నుండి తప్పుకున్నట్లు తెలుస్తుంది. అయితే ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే నేడు పుష్ప 2 పూజా కార్యక్రమాలు గ్రాండ్ గా ప్రారంభమయ్యాయి. ఈ సినిమాకి ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు రామకృష్ణ. చరణ్ సినిమాకు ఇప్పుడు ఆర్ట్ డైరెక్టర్ సమస్య వచ్చిపడింది. రవిందర్ రెడ్డి వెళ్ళిపోయి..రామకృష్ణ పుష్ప 2 బిజీ అయిపోతే..ఖచ్చితంగా చరణ్ సినిమాకి ఇబ్బందులు తప్పవు.

చరణ్ , శంకర్ కి ఏం ప్రాబ్లమ్ లేదు..వాళ్ళు మిగతా సినిమాలకి కమిట్ అవుతారు. కానీ దిల్ రాజు కే భారీ బొక్క. పెట్టిన డబ్బులు వస్తాయో రావో తెలియక..షూటింగ్ లో ఈగో సమస్యలతో..బ్రేకులు వేసుకుని..మొత్తానికి దిల్ రాకు కొంప కూల్చేస్తున్నారు అంటూ ఆయన ని ట్రోల్ చేస్తున్నారు. అసలే దిల్ రాజు తన కెరీర్ లోనే ఫస్ట్ టైం లిమిట్స్ క్రాస్ చేసి మరి RC 15 సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నాడు. కచ్చితంగా దిల్ రాజుకి ఇది పెద్ద సమస్యగా మారుతున్నట్లు తెలుస్తుంది. దీంతో కొందరు దిల్ రాజును విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు . అల్లు అర్జున్, రామ్ చరణ్ మధ్య భళే ఇరుక్కున్నాడు.. ఇద్దరిలో ఎవరిని ఒప్పించలేడు.. ఇద్దరిలో ఎవరిని కాదు అనలేదు. ఈ సినిమా రిలీజ్ అయ్యే టైం దగ్గర పడినప్పుడు దిల్ రాజుకి దూల తీరిపోతుంది. డబ్బులు పెట్టిన ప్రయోజనం లేకుండా పోతుంది..” అంటూ కొందరు ట్రోల్ చేస్తున్నారు.