మెగా ఫ్యామిలీ లో మళ్ళీ విభేదాలు.. రచ్చ లేపిన నాగబాబు పోస్ట్..!!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ముఖ్యంగా ఈ ముగ్గురు అన్నదమ్ములు కూడా చాలా సంతోషంగా ఉండటమే కాకుండా అన్నదమ్ములలో ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే అండగ నిలబడతారు. అంతేకాదు ఎవరికి ఏ ఇబ్బందులు రాకుండా చూసుకోవడం తో ఈ కుటుంబానికి మరింత గుర్తింపు లభించింది. ఇక అంతేకాదు వీరి వారసులు కూడా అంతే ఐకమత్యంగా ఉంటారనే చెప్పాలి. ఇకపోతే గత కొన్ని రోజులుగా మెగా ఫ్యామిలీలో కూడా విభేదాలు వస్తున్నాయని వార్తలు బాగా వైరల్ అవుతూ ఉండడం గమనార్హం. ఇకపోతే నటుడిగా, నిర్మాతగా ఒక మంచి గుర్తింపు సంపాదించుకున్న నాగబాబు హీరోగా సక్సెస్ కాలేకపోయారు. ఇక నిర్మాతగా భారీ నష్టాలను చవిచూసిన ఈయన బుల్లితెరపై పలు ఎంటర్టైన్మెంట్ షోలకు జడ్జిగా బాధ్యతలు స్వీకరించడం గమనార్హం.

ఇక తాజాగా 2024 లో జరగబోయే ఎన్నికలకు తన తమ్ముడు స్థాపించిన జనసేన పార్టీ కోసం పనిచేస్తున్నారు. అంతేకాదు పెద్ద ఎత్తున తమ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ప్రచార కార్యక్రమాలను కూడా నిర్వహిస్తూ ఉండడం గమనార్హం. ఇకపోతే ఈ మధ్య కాలంలో నాగబాబు సోషల్ మీడియా వేదికగా కొన్ని పోస్ట్లు చేయడం వల్ల తీవ్ర దుమారం రేపుతోందని చెప్పాలి. మొన్నటి వరకు మనుషులను దూరం చేసుకోవడం ఇష్టం లేదు.. ఒకవేళ దూరం చేసుకోవాల్సి వస్తే.. వాడి అంత పెద్ద ఎదవ ఎవరు ఉండరని పోస్ట్ పెట్టి హాట్ టాపిక్ గా మారగా.. ఇప్పుడు మరొకసారి ఇంకొక పోస్ట్ తో సంచలనం సృష్టించాడు..

ఇక ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. మంచివాడు శత్రువు కైనా సహాయం చేస్తాడు.. చెడ్డవాడు తోడబుట్టిన వాళ్లను కూడా మంచుతాడు.. మంచి వారిని దూరం చేసుకుంటే .. చివరికి ముంచేవారే దొరుకుతారు.. అంటూ కొటేషన్లు షేర్ చేయడం జరిగింది.. ఇక నాగబాబు షేర్ చేసిన ఈ కొటేషన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారడమే కాకుండా ఈయన ఎవరిని ఉద్దేశించి ఇలా పోస్ట్ చేశాడు అంటూ సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలోనే కొంతమంది తన కుటుంబంలోనే తన సోదరుని టార్గెట్ చేస్తూ ఇలా కామెంట్ చేశాడు అని భావిస్తున్నారు. ఏది ఏమైనా నాగబాబు చేసిన పోస్ట్ మాత్రం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

Share post:

Latest