బాల‌య్య బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాకు ఆ హాట్ హీరోయిన్ ఆ కార‌ణంతోనే నో చెప్పిందా..!

చాలామంది హీరోయిన్‌లు స్టార్ హీరో సినిమా అనగానే ఓకే చెప్పేస్తుంటారు. కొంతమంది మాత్రమే సినిమాలో అది నచ్చలేదు.. ఇది నచ్చలేదు అని చెప్పి రిజెక్ట్ చేస్తుంటారు. సీనియర్ హీరోల్లో ఒకరైన నట‌సింహ నందమూరి బాలకృష్ణ సినిమా అంటేనే తెలుగు ఇండస్ట్రీలో ఫుల్ క్రేజ్ ఉంటుంది. ఇప్పుడు కుర్ర హీరోలతో కూడా ఆయన పోటీ పడుతూ స్పీడ్‌గా సినిమాలు చేస్తున్నారు. దానికి రుజువు గానే గ‌త సంవ‌త్స‌రం వచ్చిన అఖండ బాలయ్య కెరీర్ లోనే సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది.

అదే క్రమంలో బాలయ్య ఓటీటీలో అన్ స్టాపబుల్ ప్రోగ్రాం తో ఫుల్ పాపులర్ అయ్యాడు… యూత్ లో కూడా ఫుల్ క్రేజ్‌ సంపాదించుకున్నారు. ప్ర‌స్తుతం త‌న 107వ ప్రాజెక్టులో న‌టిస్తోన్న సంగతి తెలిసిందే. బాలయ్య నటించిన సమరసింహారెడ్డి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో ఒక సీన్ నచ్చలేదని ఈ సినిమాను వదిలేసింది ఓ హీరోయిన్.. ఆమె ఎవరు చూద్దాం. యాక్షన్ డైరెక్టర్ గా పేరొందిన బి. గోపాల్ – బాలకృష్ణ కాంబినేషన్ లో సినిమా అనగానే ఎంతో క్రేజ్ ఉంటుంది.

Samara Simha Reddy Ultimate Posters - Balakrishna - NFDB

వీరి కాంబోలో వచ్చిన లారీ డ్రైవర్ – రౌడీ ఇన్స్పెక్టర్ – స‌మ‌ర‌సింహారెడ్డి – న‌ర‌సింహానాయుడు సూప‌ర్ హిట్లు అయ్యాయి. వీరి కాంబోలో ముచ్చటగా మూడో సినిమాగా వచ్చిన సమరసింహారెడ్డి ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అదే టైంలో ఫ్యామిలీ సినిమాల హవా నడుస్తున్న‌ప్పటికీ బి. గోపాల్ యాక్షన్ ప్లస్ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్‌లో సమరసింహారెడ్డిని తీశారు. ఈ సినిమా రిలీజ్ అయి బాలయ్యకు అదిరిపోయే హిట్ వచ్చింది.

ఈ సినిమాకు మొదట సమరసింహం అని పేరు పెట్టాలనుకున్నారు… కానీ పరుచూరి బ్రదర్స్ సమరసింహారెడ్డి అని పెడితే బాగుంటుందని చెప్పారు. దాంతో మూవీ మేకర్స్ అలానే టైటిల్ పెట్టారు. ఈ సినిమాలో హీరోయిన్స్ గా సిమ్రాన్ – అంజ‌లి ఝ‌వేరి నటించారు. ముందుగా ఈ సినిమాలో హీరోయిన్ గా రాశిను తీసుకుందామనుకున్నారు. రాశి ఈ సినిమా కథ విన్న తర్వాత సినిమాలో వచ్చే రొమాంటిక్ సీన్ అయిన‌ సీతాకోకచిలుక సిన్‌ తనకు నచ్చలేదని చెప్పి సినిమాను రిజెక్ట్ చేసింది.

Raasi tollywood heroine raasi beautiful hot pics– News18 Telugu

ఆ తర్వాత సిమ్రాన్ ని హీరోయిన్ గా పెట్టారు. సినిమా విడుదలై వసూళ్ల వర్షం కురిపించి.. ఇండస్ట్రీ హీట్ గా నిలిచింది. ఆ త‌ర్వాత‌ కొన్ని సంవత్సరాలపాటు ఈ సినిమా గురించి మాట్లాడుకునేలాగాా చేసింది. ఇలా రాశి బాలయ్యతో సూపర్ హిట్ సినిమా మిస్ చేసుకోంది.

Share post:

Latest