వామ్మో..ఎన్టీఆర్ ను పెళ్లి చేసుకోవడానికి లక్ష్మీ ప్రణతి ఇన్ని కండిషన్లు పెట్టిందా…?

నందమూరి నట వారసుడిగా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తారక్..ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో అగ్ర హీరోల్లో ఒకరిగా కొనసాగుతున్నారు. ప్రజెంట్ నందమూరి ఫ్యామిలీ అనగానే ఫస్ట్ గుర్తు వచ్చేది బాలకృష్ణ అయితే..ఆ తర్వాత అందరికి గుర్తు వచ్చేది ఎన్టీఆర్ నే. రూపంలో నే కాదు..నటనలోను ఎన్టీఆర్..తాతకు తగ్గ మనవడని నిరూపించుకున్నాడు. తాజాగా ఆర్ ఆర్ ఆర్‌ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్నాడు.తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఎన్టీఆర్‌ పై ఇప్పటివరకు ఎలాంటి రోమర్లు కూడా లేవు. తన పని తాను చేసుకు పోతుంటాడు తారక్.

 

సినిమా లైఫ్ ను, పరసనల్ లైఫ్ ను సమానంగా బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నాడు తారక్. కెరియర్ మంచి ఊపు మీద ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకున్నాడు. నారా చంద్రబాబునాయుడు కి ఎన్టీఆర్ మామగారు వరసకు మేనల్లుడు అవుతారు. అలా ఎన్టీఆర్ తన బంధువులలో ఒకరైన లక్ష్మి ప్రణతిని పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. లక్ష్మి ప్రణతి కుందనపు బొమ్మ..తన కట్టు బొట్టుతో ఎన్టీఆర్ గౌర్వాని ఇంకా పెంచుతుంది. తారక్ ప్రణతి దంపతులకు ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు. వారి పేర్లు అభయ్ రామ్, భార్గవ్ రామ్ . ఎన్టీఆర్ ది పెద్దలు కుదుర్చున పెళ్లి అయినప్పటికీ బంధువుల అమ్మాయి అవ్వడంతో వీరి ఇరువురు పెళ్లికి ముందు తరచూ ఫోన్లో మాట్లాడుకునే వారట.

 

ఆ సందర్భంలో ఎన్టీఆర్‌కు లక్ష్మీ ప్రణతి కొన్ని కండిషన్లు కూడా పెట్టిందట. పెళ్లి అయిన తర్వాత సినిమాలతో బిజీగా ఉన్నా సరే కొంచెంటైం ఫ్యామిలీ కోసం కేటాయించాలని ప్రణతి చెప్పిందట. పెళ్లి అవ్వకముందు ఎన్టీఆర్ ఎక్కువగా ఫ్రెండ్స్ తో కలిసి బయటకు వెళ్లేవారట. అయితే, పెళ్లి త‌ర‌వాత మీరు ఫ్రెండ్స్ తో బయటికి వెళ్ళడం తగ్గించాలని కూడా చెప్పిందట. ఎన్టీఆర్ తన సినిమా షూటింగుల్లో అవుట్ డోర్ వెళ్లేటప్పుడు వేసుకునే డ్రెస్సెస్ ని కూడా తానే తీసుకుంటానని ముందే చెప్పిందట. అంతేకాదు, తారక్ ఫుడ్ విషయం లో లక్ష్మి ప్రణతి చాలా స్ట్రిక్ట్ గా ఉంటుందట. ఇలా ముందుగానే లక్ష్మీ ప్రత్తి తారక్ కి కొన్ని కండిషన్స్ పెట్టిందట. ఆ కండిషన్లు విని తారక్ నవ్వుకున్నారట. ఫైనల్లీ పెళ్లి చేసుకుని..ఇద్దరు బిడ్డలతఓ హ్యాపీగా ఉన్నారు. వీరు ఇరువురు ఇప్పుడు చాలామంది జంటలకు ఆదర్శంగా ఉన్నారు.

Share post:

Latest