బెజవాడ పాలిటిక్స్..దేవినేని గేమ్ !

గత కొన్ని రోజులుగా కేశినేని నాని ఫ్యామిలీ రాజకీయం…బాగా హాట్ టాపిక్ అవుతున్న విషయం తెలిసిందే…నాని రెండోసారి ఎంపీగా గెలిచిన దగ్గర నుంచి సొంత పార్టీపైనే విమర్శలు చేస్తూ వస్తున్నారు…కొందరు నేతలు టార్గెట్ గా ఫైర్ అవుతూ వచ్చారు. అలాగే ఆ మధ్య తనకు వ్యతిరేకంగా తన తమ్ముడు కేశినేని శివనాథ్ అలియాస్ చిన్నిని ప్రోత్సహిస్తున్నారని, అలా చేస్తే తాను టీడీపీ శత్రువులని ప్రోత్సహించాల్సి వస్తుందని కౌంటర్ ఇచ్చారు.

ఇటు ఏమో చిన్ని..చంద్రబాబు ఏం చెబితే అది చేస్తానని అంటున్నారు. ఇదే క్రమంలో చిన్ని ఎప్పటినుంచో విజయవాడ రాజకీయాల్లో కీలకంగా పనిచేస్తున్నారు…ఈయనకు కేశినేని వ్యతిరేక వర్గమైన బుద్దా వెంకన్న, బోండా ఉమా, దేవినేని ఉమాల మద్ధతు ఉందని తెలుస్తోంది. ఇదే క్రమంలో నాని నెక్స్ట్ పోటీ చేయనని ఎప్పుడో ప్రకటించారు..దీంతో నెక్స్ట్ విజయవాడ ఎంపీ సీటు చిన్నికే అని ప్రచారం నడుస్తోంది. అయితే నాని పూర్తిగా పోటీ చేసే విషయంలో ఇంకా క్లారిటీ ఇవ్వలేదు…అలా అని ఆయనకు పార్టీ మారే ఉద్దేశం కూడా కనిపించడం లేదు.

కానీ నానికి వ్యతిరేకంగా విజయవాడలో చిన్నిని రాజకీయంగా పెంచే కార్యక్రమం మాత్రం జరుగుతుంది. ఇదే క్రమంలో విజయవాడ రాజకీయాల్లో చిన్నికి నిదానంగా మద్ధతు పెరుగుతుంది. ఇప్పటికే ఆయన…వంగవీటి రాధాతో భేటీ అయిన విషయం తెలిసిందే. అలాగే బుద్దా, దేవినేనిలతో అంతర్గతంగా టచ్ లో ఉన్నారని సమాచారం. ఇక ఇలాంటి పరిణామాల నేపథ్యంలో తాజాగా చిన్ని పుట్టినరోజు కావడంతో…ఆయనకు దేవినేని ఉమా, బోండా, బుద్దా విషెస్ చెప్పారు. తమ సోషల్ మీడియా ఖాతాల్లో చిన్నికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు.

అయితే గతంలో ఎప్పుడు చిన్నికి వారు ఈ విధంగా విషెస్ చెప్పిన సందర్భాలు లేవు…కేవలం ఇప్పుడు చిన్ని విజయవాడ పార్లమెంట్ అభ్యర్ధి అని ప్రచారం జరుగుతున్నప్పుడే విషెస్ చెప్పారు. అంటే చిన్ని వెనుక దేవినేని, బోండా, బుద్దా ఉన్నారని అర్ధమవుతుంది. కేశినేని నానికి తన తమ్ముడుతోనే చెక్ పెట్టేందుకు రంగం సిద్ధం చేశారు.

Share post:

Latest