నాగార్జున హీరోయిన్ ఇంట్లో తీవ్ర విషాదం… !

కింగ్ నాగార్జున గురించి..ఆయన నటనా విధానం గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆరుపదుల వయసులో కూడా దూసుకుపోతూ వరుస సినిమాలు చేస్తూ ఎంతో బిజీగా ఉన్నారని చెప్పవచ్చు. ఇది ఇలా ఉండగా ఈయనతో కలిసి నటించిన ఎంతోమంది హీరోయిన్లకు మంచి పేరు లభించింది. ఇక అలాంటివారిలో ప్రముఖ మోడల్, నిర్మాత, హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న దియా మీర్జా కూడా ఒకరు. ఇక ఈమె పుట్టింది హైదరాబాదులో అయినా బాలీవుడ్ లో బాగా పాపులారిటీని సంపాదించుకుంది. ముఖ్యంగా మిస్ ఆసియా పసిఫిక్ 2000 టైటిల్ ను గెలుచుకున్న దియా.. సంజు, తప్పడ్, కుర్బాన్, లగే రహో మున్నాభాయ్ వంటి 10 చిత్రాలలో నటించి మంచి పేరును సంపాదించుకుంది. ఇకపోతే ఇటీవల బాలీవుడ్ కింగ్ నాగార్జున నటించిన వైల్డ్ డాగ్ సినిమాలో కూడా నటించింది దియా మీర్జా.Nagarjuna Akkineni turns 62: Anil Kapoor, Dia Mirza, Kajal Aggarwal wish  him - Hindustan Times

అయితే దియామీర్జా కుటుంబానికి సంబంధించి సోమవారం అనగా ఆగస్టు ఒకటవ తేదీన ఎంతో విషాదకరమైన రోజు అని చెప్పవచ్చు. ఎందుకంటే సోమవారం హైదరాబాదులో జరిగిన కారు ప్రమాదంలో దియామీర్జా మేనకోడలు తాన్యా కక్డే మృతి చెందింది. ఇక ఈమె మరణ వార్తను తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా దియామీర్జా ఒక ఎమోషనల్ నోట్ రాసుకొచ్చింది.. నా కోడలు.. నా బిడ్డ.. నా ప్రాణం.. ఇక లేదు. తను స్వర్గానికి వెళ్ళింది. నువ్వు ఎక్కడున్నా ప్రేమను శాంతిని పొందుతావని ఆశిస్తున్నాను. నువ్వు ఎప్పుడు మా హృదయాలలో చిరునవ్వు నింపే దానివి.. నీ ఆట, పాట, చిరునవ్వు ఎప్పుడూ మాతోనే ఉంటాయి ఓం శాంతి.. అంటూ భావోద్వేగా రాసుకొచ్చింది.

తాన్యా కక్డే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి మరో నలుగురు స్నేహితులతో తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ముఖ్యంగా వీరు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రోడ్డు డివైడర్ ను ఢీకొట్టడంతో బోల్తా పడింది. ఇక ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో తాన్య మృతి చెందింది.ఇక అక్కడి నుంచి ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఇకపోతే బ్యూటిషన్ గా పని చేస్తున్న 25 ఏళ్ల తాన్యా కాంగ్రెస్ పార్టీ నాయకుడు మహమ్మద్ ఫిరోజ్ ఖాన్ కుమార్తే. ఏది ఏమైనా దియా మీర్జా మాత్రం తాన్యా మరణాన్ని జీర్ణించుకోలేకపోతుందని చెప్పవచ్చు.

https://www.instagram.com/p/Cgt3A5YvccE/?utm_source=ig_embed&ig_rid=5da07c29-5a40-4953-a3f9-e9712e9bd794