ప్రైమ్ పాప‌ర్టీని కోట్ల‌కు అమ్ముకున్న చిరు… ఎన్ని కోట్లు అంటే..!

మెగాస్టార్ చిరంజీవి సినిమాల ద్వారా ఎంత పేరు సంపాదించుకున్నారో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రాజకీయ పార్టీని ఏర్పాటు చేసినప్పటికీ ముఖ్యమంత్రి పదవిని చేజిక్కించుకోలేక చివరికి రాజకీయాలకు దూరంగా ఉన్న చిరంజీవి కేంద్ర మంత్రి పదవి చేపట్టడం జరిగింది. ఇక ప్రస్తుతం సినిమాలలో బిజీగా ఉంటూ యంగ్ హీరోలతో పోటీ పడుతూ ఆరుపదుల వయసులో కూడా వరుస సినిమాలు చేస్తూ మరింత ఇమేజ్ను సొంతం చేసుకుంటున్నారు చిరంజీవి. ఇకపోతే మెగాస్టార్ చిరంజీవికి ఆస్తిపరంగా కూడా ఎన్నో వేలకోట్ల ప్రాపర్టీలు ఉన్నాయి . ఇన్నాళ్లు సుదీర్ఘ సినిమా ప్రయాణంలో కష్టపడి సంపాదించి ఆయన చాలా పెట్టుబడులు పెట్టారు.Chiranjeevi: I will direct a film in the future- Cinema express

లక్షల్లో పెట్టిన పెట్టుబడులు ఇప్పుడు కోట్లకు చేరుకున్నాయి. ఇలాంటి ప్రాపర్టీ లో ఫిలింనగర్ మెయిన్ రోడ్డు మీద కీలక ప్రదేశంలో ఉన్న మూడువేల గజాల స్థలం కూడా ఉంది. అప్పట్లో దీన్ని ఆయన రూ.30 లక్షలకు కొనుగోలు చేశారు అని సమాచారం. ఇప్పుడు ఆ అత్యంత విలువైన స్థలాన్ని చిరంజీవి విక్రయించినట్లు సమాచారం. నిజానికి ఇలా అమ్మాల్సిన అవసరం చిరంజీవికి ఏ మాత్రం లేదు.. ఎందుకంటే ఆయన స్థాయి అలాంటిది మరి.. కానీ ఎందుకో అమ్మేశారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ స్థలం మీద ఒక పాపులర్ దినపత్రిక యజమాని ఎప్పటినుంచో ఆశపడుతున్న నేపథ్యంలో గత కొన్ని సంవత్సరాలు నుంచి చిరంజీవిని ఆ స్థలం కోసం అడుగుతున్నట్లు సమాచారం. ఇక్కడ ఆయన దినపత్రిక ఛానల్ కార్యాలయాన్ని నిర్మించబోతున్నారట. ఈ క్రమంలోనే చిరంజీవి ఆ దినపత్రిక యజమానికి అమ్మేసినట్లు సమాచారం.Chiranjeevi : విలువైన స్థ‌లాన్ని విక్ర‌యించిన చిరంజీవి.. అంత అవ‌స‌రం  ఏమోచ్చింది? | The News Qube

కొనుగోలు, అమ్మకానికి సంబంధించిన అన్ని కూడా క్లియర్ అయ్యాయని సుమారు రూ. 70 కోట్లకు కాస్త అటు ఇటుగా ఈ డీల్ కుదిరింది అని కూడా తెలుస్తోంది. ఇందులో ఎంత నిజం ఉందో తెలియాలంటే చిరంజీవి లేదా ఆయన పీఆర్ ఎవరో ఒకరు క్లారిఫై ఇవ్వాల్సి ఉంటుంది.

Share post:

Latest