అదేంటి నాగ్‌కు చిరుకు ఎక్క‌డ తేడా వ‌చ్చింది… నాగ్ ఎందుకు ఈ షాకింగ్ డెసిష‌న్ తీసుకున్నాడు…!

సీనియర్ హీరోలు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోలుగా కొనసాగుతున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీకి నాలుగు మూల స్తంభాలుగా ఉంటూ వస్తున్నారు. 80,90వ దశంలో వీళ్ళ సినిమాలు విడుదలవుతున్నాయి అంటే సినీ అభిమానులకు పండగల ఉండేది. ఇప్పటికీ వీళ్ళు కుర్ర హీరోలకి పోటీ వ‌స్తూ సినిమాలు చేస్తూ వస్తున్నారు. బాలకృష్ణ- చిరంజీవి యాక్షన్ సినిమాలు చేస్తూ మాస్ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు.

Gap btw Chiru & Other Seniors Increased at BO

బాల‌కృష్ణ‌- చిరంజీవి సినిమాలు రిలీజ్ అంటే అభిమానులకి యుద్ధంలా ఉండేది. అదే క్రమంలో వెంకటేష్- నాగార్జున ఫ్యామిలీ సినిమాలు ప్రేమ కథలు చేసుకుంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చేవారు.
వీరి మధ్య స్నేహ సంబంధాలు కూడా మంచిగానే ఉండేవి.. వీరులో ముఖ్యంగా చిరంజీవి- నాగార్జున బంధం మాత్రం చాలా ప్రత్యేకమైనది. వీరిద్దరి మధ్య మంచి స్నేహ సంబంధమే ఉంది నాగార్జున చిరంజీవిని అన్నయ్య అని ప్రేమగా పిలుస్తుంటాడు.

Nagarjuna's The Ghost to release on this date; Teaser out- Cinema express

అయితే ఇప్పుడు వీళ్లిద్దరి మధ్య బాక్సాఫీస్ వార్ మొదలయింది. ఇద్దరి సినిమాలో ఒకేరోజు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. చిరంజీవి గాడ్ ఫాదర్ అక్టోబర్ 5 న‌ విడుదలవుతుంది. అదే రోజు నాగార్జున ది ఘోస్ట్ విడుదల కానుంది. సంక్రాంతి, వేసవి సెలవుల‌ తర్వాత దసరా సినిమాలకు మంచి సీజన్ లాంటిది. ఆ టైంలో ఇద్దరు స్టార్ హీరోలు సినిమాలు ఒకేరోజు రిలీజ్ అంటే బాక్సాఫీస్ వార్ మామూలుగా ఉండ‌దు.

Chiranjeevi is all swag in Godfather first-look poster

ఈ టైంలో ఈ ఇద్ద‌రు సీనియ‌ర్ హీరోల సినిమాలు ఒకేసారి వ‌స్తే ఆ ప్ర‌భావం క‌లెక్ష‌న్ల‌పై గ‌ట్టిగానే ఉంటుంది. ఈ రెండు సినిమాల‌తో పాటు బెల్లంకొండ రెండో కుమారుడు న‌టించిన స్వాతిముత్యం కూడా అదే రోజున రిలీజ్ కాబోతుంది. మ‌రి నాగ్ కావాల‌నే అదే రోజు చిరు సినిమా ఉన్నా త‌న సినిమా రిలీజ్ డేట్ వేయ‌డంతో ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు కూడా షాక్ అవుతున్నాయి.

Swathi Muthyam Movie (2022) | Cast & Crew | Trailer - CiniPedia