బీజేపీలోకి చిరంజీవి లక్కి హీరోయిన్‌…షాకింగ్ ట్వీస్ట్ ఇచ్చిందే..!?

తెలంగాణలో బీజేపీ పార్టి అధికారమే లక్ష్యంగా వ్యూహాలు అమలు చేస్తుంది. పక్క పొలిటికల్ స్త్రాటజీలను వేస్తూ..ఎత్తుకు పై ఎతులతో అధికారంలోకి రావడానికి ట్రై చేస్తుంది. అదే క్రమంలో బీజేపీ ఆపరేషన్ ఆకర్షణ మొదలుపెట్టి ఇటు టిఆర్ఎస్ కాంగ్రెస్ ఇతర పార్టీ నాయకులను బీజేపీలోకి ఆహ్వానిస్తున్నారు. ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్‌లో సీనియర్ నాయకుడైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మరి ఈనెల 21న అమిత్ షా సమక్షంలో బిజెపిలో చేరనున్నాడు.

ఇందులో భాగంగానే బీజేపీ జాయినింగ్ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ తెలుగు సీనియర్ నటి మాజీ ఎమ్మెల్యే జయసుధతో మంగళవారం సమావేశమయ్యారు. బీజేపీలోకి రావాలని ఆహ్వానించినట్లు సమాచారం. సినీ గ్లామర్ అనేది తమ పార్టీకి బాగా కలిసొస్తుందని బీజేపీ గత కొంతకాలంగా నమ్ముతూ వస్తోంది. ఈ క్రమంలోనే ప్రముఖ సినీ నటులను తమ పార్టీలోకి చేర్చుకుంటోంది. తమిళనాడులో కుష్బూ, తెలంగాణలో విజయశాంతి. ఇలా ప్రతి రాష్ట్రంలోనూ సినీ ప్రముఖులను తమ పార్టీలో చేర్చుకుంటోంది. ఈ క్రమంలోనే జయసుధతో సంప్రదింపులు జరుపుతోంది.

BJP-Jayasudha: BJP akarsh operation accelerates in Telangana..Film actress Jayasudha to wear saffron shawl soon! | Telugu actress Jayasudha may join Telangana Bharatiya Janata Party on August 21News JANI | News Jani

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంత‌రం ఆమె రాజ‌కీయాల‌కు చాల దూరంగా ఉన్నారు. అయితే ఇప్పుడు ఏ పార్టీలోనూ లేరు. గతంలో కాంగ్రెస్ పార్టీ త‌రుపున సికింద్రాబాద్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి,,భారీ మెజారిటీతో గెలిచారు. దింతో అ ప‌రిధిలో అమెకు కొంత ప‌ట్టు ఉంది. దీనే క్యాష్ చేసుకోవాలని చూస్తుంది బిజేపి. ఆమెను పార్టీలోకి తీసుకొనేందుకు బీజేపీ ఆసక్తి చూపుతుంది. ఈ క్ర‌మంలోనే అమిత్ షా ప‌ర్య‌ట‌న‌లో పార్టీలోకి రావాల‌ని జ‌య‌సుధ‌ను కోరిన‌ట్లు స‌మాచారం.

Share post:

Latest