ఆహా కోసం భారీ స్కెచ్ వేస్తున్న చిరంజీవి..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాతగా ఎన్నో సినిమాలకు వ్యవహరించి మంచి పేరు సంపాదించారు అల్లు అరవింద్. తెలుగులో ఓటీటీ సంస్ధ ఆహా ను ప్రారంభించిన విషయం అందరికీ తెలిసినదే. ఆహా ద్వారా ఎన్నో వెబ్ సిరీస్లను , సినిమాలను విడుదల చేస్తూ బాగా పాపులర్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఎంతోమంది సబ్స్క్రైబర్ లను సొంతం చేసుకున్నది ఆహా. ఆహా ఓ టీ టీ ను నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టడానికి నిర్మాత అల్లు అరవింద్ చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే బాలకృష్ణ వ్యాఖ్యాతగా అన్ స్టాపబుల్ కార్యక్రమంతో ప్రేక్షకులను మరింత దగ్గర అయ్యేలా చేశారు.AHA Finally Apologizes To Mega Star Chiranjeevi Fans - Say Cinema

- Advertisement -

ఇకపోతే తాజాగా మెగాస్టార్ చిరంజీవితో సరికొత్త కార్యక్రమాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే విధంగా సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటివరకు ఏ భాషలో రానటువంటి కార్యక్రమాన్ని అల్లు అరవింద్ ఆహా ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తున్నది. ఇకపోతే ఈ కార్యక్రమం కోసం చిరంజీవి ఒక పెద్ద సాహసమే చేస్తున్నారని చెప్పవచ్చు. ఈ విధంగా చిరంజీవిని ఆహా కోసం రంగంలో దింపడం వెనక ఒక కారణం ఉందని కూడా తెలుస్తున్నది. ఇక చిరంజీవికి కూడా ఆహ లో వాటా ఉందన్నట్లుగా వార్తలు బాగా వినిపిస్తున్నాయి.Aha! Chiranjeevi Coming After A Long Time - Movie News

ఇదేవిధంగా ఈ కార్యక్రమానికి చిరంజీవి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తే ఆయనకు భారీ పారితోషకం కూడా ముట్టజెప్పే పని ఉండదు అంతేకాకుండా ఆ కార్యక్రమం లాభాలలో వాటా ఇవ్వడం గురించి చిరంజీవితో అల్లు అర్జున్ చర్చలు జరిపిస్తున్నట్లుగా తెలుస్తున్నది. మరి చిరంజీవిపై వస్తున్న ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలి అంటే ఈ విషయంపై అల్లు అరవింద్ క్లారిటీ ఇస్తే తప్ప తెలియదని చెప్పవచ్చు. అయితే మెగా అభిమానులు మాత్రం ఈ విషయం తెలియడంతో చాలా ఖుషీ అవుతున్నట్లుగా తెలుస్తోంది.

Share post:

Popular