10 సీట్లు ఫిక్స్ చేసిన బాబు..!

గతం కంటే భిన్నంగా చంద్రబాబు రాజకీయం ఉంది…గతంలో ఏ పని చేయాలన్న చాలా ఆలస్యంగా చేసేవారు. ఆఖరికి అభ్యర్ధులకు సీట్లు ఫిక్స్ చేసే విషయంలో కూడా చాలా లేట్..నామినేషన్ రేపు అనగా కూడా ఈరోజు సీట్లు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. దాని వల్ల అభ్యర్ధికి నియోజకవర్గంలో తక్కువ సమయం తిరిగే ఛాన్స్ ఉంటుంది..అందుకే ఆ సీట్లలో టీడీపీ ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి.

అయితే ఇదంతా గతంలో ఇప్పుడు తీరు మారింది..నెక్స్ట్ అధికారంలోకి రావడం బాబుకు చాలా ముఖ్యం..అందుకే దూకుడుగా రాజకీయం చేస్తున్నారు…ఎన్నికలకు ఏడాదిన్నర సమయం ఉండగానే అభ్యర్ధులని ఖరారు చేసుకుంటూ వెళ్లిపోతున్నారు. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో అభ్యర్ధులని ఖరారు చేశారు..ఇదే క్రమంలో తాజాగా నియోజకవర్గాల ఇంచార్జ్ లతో భేటీ అవుతున్న ఆయన…మరో 10 స్థానాల్లో అభ్యర్ధులని ఖరారు చేశారు. ఎవరైతే ఇంచార్జ్ లుగా ఉన్నారో…వారే పోటీ చేస్తారని క్లారిటీ ఇచ్చేశారు.

తాజాగా అవనిగడ్డ ఇంచార్జ్ మండలి బుద్ధప్రసాద్, పెనమలూరు-బోడే ప్రసాద్, సంతనూతలపాడు-విజయ్ కుమార్, మార్కాపురం-కందుల నారాయణరెడ్డిలతో భేటీ అయ్యి, నియోజకవర్గంలోని పరిస్తితులని తెలుసుకుని, ఇంకా ఎఫెక్టివ్ గా పనిచేయాలని చెప్పి…వారే నెక్స్ట్ ఎన్నికల్లో పోటీకి దిగుతారని క్లారిటీ ఇచ్చేశారు. అవనిగడ్డలో మండలి తనయుడు పోటీ చేస్తారని ప్రచారం జరిగింది గాని..ఆ ప్రచారాన్ని కొట్టేస్తూ బుద్ధప్రసాద్ మళ్ళీ పోటీ చేస్తారని చెప్పేశారు.

ఇక వీరి తర్వాత… భూమా అఖిలప్రియ(ఆళ్లగడ్డ), చల్లా రామచంద్రారెడ్డి (పుంగనూరు), మహ్మద్‌ నజీర్‌ (గుంటూరు తూర్పు), బత్యాల చెంగల్రాయుడు(రాజంపేట), దామచర్ల జనార్దన్‌ (ఒంగోలు), పుట్టా సుధాకర్‌ యాదవ్‌ (మైదుకూరు), గౌరు వెంకటరెడ్డి (నందికొట్కూరు-ఎస్సీ)లతో చంద్రబాబు భేటీ అయ్యారు. వీరిలో అరుగురుకు సీటు ఫిక్స్ చేశారు. ఒక్క నందికొట్కూరు విషయం మాత్రమే క్లారిటీ లేదు. ఇది ఎస్సీ రిజర్వడ్ కావడంతో, అక్కడ బలమైన ఎస్సీ అభ్యర్ధిని పెట్టాలని బాబు చూస్తున్నారు. మొత్తానికైతే 10 స్థానాల్లో బాబు అభ్యర్ధిని ఫిక్స్ చేసేశారు.