బిగ్ బ్రేకింగ్: అక్కడ లైగర్ సినిమాకు బ్రేక్..షాకింగ్ ట్వీస్ట్ ఇచ్చిన పూరీ జగన్నాధ్..!?

రౌడీ హీరో విజయ్ దేవరకొండ అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా ఎదురుచూస్తున్న క్షణం మరి కొద్ది గంటల్లో రాబోతుంది. యస్ పూరి జగన్నాథ్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన లైగర్ మూవీ ప్రపంచవ్యాప్తంగా మరికొద్ది గంటల్లో థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన అన్ని పనులను పూర్తి చేశాడు పూరి జగన్నాథ్. ఇప్పటికే పలు థియేటర్స్ వద్ద లైగర్ హంగామా నడుస్తుంది. భారీ కటౌట్లతో పాలాభిషేకాలతో.. అరుపులతో.. కేకలతో.. విజయ్ దేవరకొండ ఫాన్స్ రచ్చ చేస్తున్నారు . సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడం ఖాయం అనిపిస్తుంది.


రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే కలిసి నటిస్తున్న ఈ సినిమా పై మొదటి నుంచి పాజిటీవ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోని ఉన్నారు అభిమానులు. పైగా మార్షల్ ఆర్ట్స్ ఈ సినిమాలో ప్రత్యేకంగా హైలైట్ గా నిలవనున్నాయి అంటూ ఇప్పటికే లైగర్ మూవీ టీం చెప్పుకొచ్చింది. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్లపై.. పూరి, ఛార్మి కరణ్ జోహార్, అపూర్వ మెహతా, సంయుక్తంగా నిర్మించిన ఈ గ్రేటెస్ట్ మూవీ మరికొద్ది సేపట్లోనే ఫస్ట్ షో పడనుంది. ఈ సినిమాకి మరో ప్లస్ పాయింట్ వరల్డ్ ఫేమస్ బాక్సర్ మైక్ టైసన్ లైగర్ లో కీలకపాత్రలో నటించారు. దీంతో ఈ సినిమా ఖచ్చితంగా బాక్సాఫీస్ చరిత్రను తిరగరాస్తుందంటూ సినీ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు.

నిజానికి ఈ సినిమా పై తెలుగు ప్రేక్షకులు కన్నా బాలీవుడ్ జనాలే ఆశలు పెట్టుకొని ఉన్నారు. దానికి ఏకైక కారణం రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ క్రేజ్. ఆయనకున్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మరీ ముఖ్యంగా లైగర్ ప్రమోషన్స్ ని కూడా ఎక్కువగా నార్త్ సైడ్ ప్రమోట్ చేస్తూ క్రేజీ హైప్ తీసుకొచ్చారు . అయితే ఫిలిం సర్కిల్స్ నుంచి తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం లైగర్ హిందీ వర్షన్ కు బ్రేక్ పడ్డట్టు తెలుస్తుంది.

యస్ అందుతున్న సమాచారం ప్రకారం ఈ వార్త నిజమే. లైగర్ హిందీ వర్షన్ సినిమా రిలీజ్ కు ఆలస్యం కానుంది. బాలీవుడ్ లో ఈ సినిమాను రిలీజ్ చేయడానికి మరి కొంత సమయం పడుతుందంటూ సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ గా మారింది. నిజానికి అనుకున్న లెక్క ప్రకారం హిందీ లైగర్ సినిమా కూడా మరి కొద్ది గంటల్లో ఫస్ట్ షో పడాల్సిందే .

కానీ హిందీ వర్షన్ షో బాలీవుడ్ లో ఆపేసారంటూ ఓ న్యూస్ వైరల్ గా మారింది. వరల్డ్ వైడ్ గా అన్ని భాషల్లో లైగర్ సినిమా గురువారం ఉదయం మొదటి ఆటతో స్టార్ట్ అవ్వనుంది. అయితే హిందీలో మాత్రం గురువారం రాత్రి నుంచి బొమ్మ పడనున్నట్టు తెలుస్తుంది. హిందీ వర్షన్ ఆలస్యం కావడానికి కారణం పూరి జగన్నాథ్ అంటూ మరో కొత్త రూమర్ వైరల్ గా మారింది. ఇది బిగ్గెస్ట్ సినిమా స్ట్రాటజీగా సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి చూడాలి ఈ వార్తలో ఎంత నిజం ఉందో..? లైగర్ ఎలాంటి హిట్ సాధిస్తుందో..? మరి కొద్ది గంటల్లోనే రివ్యూ తో కలుసుకుందాం..!!

Share post:

Latest