మన వల్లే థియేటర్లలో సినిమాలు ఆడడం లేదు.. అమీర్ ఖాన్..!!

బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న అమీర్ ఖాన్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈయన నటించే ప్రతి సినిమా కూడా ఒక విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు వస్తుందని చెప్పవచ్చు. ఇది ఇలా ఉండగా తాజాగా బాలీవుడ్లో ఆయన నటించిన సినిమా లాల్ సింగ్ చద్దా.. ఈ సినిమా ఆగస్టు 11వ తేదీన విడుదల కాబోతున్న నేపథ్యంలో తెలుగు, తమిళ, హిందీ భాషలలో విడుదల అవుతున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాలో టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య బాలరాజు పాత్రలో కీలకపాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి బాలరాజు క్యారెక్టర్ ని కూడా రివీల్ చేశారు దర్శకనిర్మాతలు.Aamir Khan on industry quickly releasing films on streaming platforms: 'For  economic or bandwidth reasons, you cannot have it coming on OTT so fast' :  Bollywood News - Bollywood Hungamaఇక ఈ సినిమాలో హీరోయిన్గా కరీనాకపూర్ నటిస్తోంది. ఇకపోతే ప్రస్తుతం సినిమా ప్రమోషన్స్ లో చాలా బిజీగా ఉన్న నేపథ్యంలో ఒక్కొక్కరు ఒక్కో ఇంటర్వ్యూ ఇస్తూ రకరకాలుగా సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. ఇక ఇదిలా ఉండగా ప్రమోషన్స్లో పాల్గొన్న అమీర్ ఖాన్ మాట్లాడుతూ మనవల్లే థియేటర్లకు ప్రేక్షకులు రావట్లేదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం థియేటర్లలో సినిమాలు ఆడక పోవడానికి ఓటీటీల తప్పు ఏమీ లేదు అని అమీర్ ఖాన్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. వాస్తవానికి ఓటీటీలు సినీ పరిశ్రమకు ఎంతో మేలు చేస్తున్నాయని ,వాటి వల్ల ఎటువంటి ప్రమాదం లేదు అని, తప్పు మనమే చేస్తున్నామని , సినిమాలు విడుదలైన తక్కువ రోజుల వ్యవధిలోనే ఓటీటీల్లోకి సినిమాలు వచ్చేస్తుంటే జనాలు థియేటర్లకు ఎందుకు వెళ్తారు? అంటూ ఆయన ప్రశ్నించారు.Aamir Khan Birthday Special: 10 Best performances by Mr Perfectionist that  make him the 'Ace of Bollywood' | Celebrities News – India TVఇక హాయిగా ఇంటి వద్దనే కూర్చుని కుటుంబంతో కలిసి సినిమాలు చూద్దామని అనుకునే వారి సంఖ్య రోజుకూ ఎక్కువవుతుంది . అందుకే సినిమా విడుదలైన ఆరు నెలల తర్వాతే ఓటీటీలోకి విడుదల చేస్తే అలాంటప్పుడు సినిమాకు కచ్చితంగా హిట్టు టాకు వస్తుంది..ఇక ప్రేక్షకులు యధావిధిగా థియేటర్కు వచ్చి సినిమాలు చూస్తారు అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించారు అమీర్ ఖాన్. థియేటర్లో విడుదలైన నాలుగు లేదా ఆరు వారాలకి ఓటీటిలో సినిమా రిలీజ్ చేయకూడదు అని తన అభిప్రాయాన్ని వెల్లడించారు అమీర్ ఖాన్.

Share post:

Latest