శ్రీదేవి కారణంగా ఆ డైరెక్టర్ చేతిలో చివాట్లు పడ్డ తేజ.. కారణం..?

ప్రముఖ దర్శకుడు తేజ తన కెరీర్ మొదట్లో అసిస్టెంట్ గా, క్లాప్ మ్యాన్ గా పనిచేస్తున్న రోజుల్లో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ గోపాల్ రెడ్డి దగ్గర అసిస్టెంట్ గా పనిచేసేవారు. ఇటీవల ఆయన తొలినాళ్ళ లో క్లాప్ కొడుతూ ఉండే వాడిని అని తాజాగా ఎన్నో సంచలమైన విషయాలను వెల్లడించడం జరిగింది. ఇక తేజ మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీ అంటే ఆశామాషి వ్యవహారం కాదు. ఒక సినిమా షూటింగ్ తీస్తున్నాము అంటే ఎన్నో విషయాలు జాగ్రత్తగా వహించాల్సి ఉంటుంది .కెమెరా నుంచి లైట్ వరకు ప్రతి ఒక్కటి కూడా సరిగ్గా పనిచేస్తేనే అవుట్ ఫుట్ బాగా వస్తుంది అంటూ తేజ తెలిపారు. ఇకపోతే అలా బాగా నమ్మే వ్యక్తులలో అమితాబ్ బచ్చన్, శ్రీదేవి లాంటి దిగ్గజ నటీనటులు కూడా ఉన్నారు. ఇక ఒకానొక సమయంలో రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో క్షణక్షణం సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో జరిగిన ఒక సంఘటనను దర్శకుడు తేజ ప్రేక్షకులతో పంచుకున్నారు. Director Teja About Teja And Amitab Details, Heroine Sridevi, Amitab Bachchan, Kshana Kshanam Movie, Ram Gopal Varma, Director Teja, Tollywood, Director Teja Comments, Producer Gopal Reddy-సెట్లో శ్రీదేవి, అమితాబ్ చేసిన పనికి ఖంగు తిన్న తేజ..అలా అమే వల్ల తిట్లు తిన్నాడట-,Top Story-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సినిమాకు సినిమా ఆటోగ్రాఫర్ గా పనిచేశారు గోపాల్ రెడ్డి . అలాగే నిర్మాత కూడా ఆయనే ఉన్నారు. రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ఆ సమయంలో తేజ గోపాల్ రెడ్డికి అసిస్టెంట్గా పనిచేసేవారట. ఇక ఒకవైపు క్లాప్ కొడుతూనే మరోవైపు కెమెరాలు కూడా ఆపరేట్ చేసేవారని .. తేజ.. క్షణక్షణం షూటింగ్ లొకేషన్లోకి వచ్చిన శ్రీదేవి అద్దంలో తనని తాను చూసుకుంటూ తన వెనకాల పడిన ఒక లైటు గురించి గోపాల్ రెడ్డిని పిలిచి ఆ లైట్ సరిగ్గా లేదు.. ఒకసారి చూడండి అని చెప్పారట. దాంతో గోపాల్ రెడ్డి తేజని పిలిచి బాగా కోప్పడ్డారు. ఇక బాగా చిర్రేత్తుకొచ్చిందట తేజకి.. ఆ తర్వాత ఈమె పని ఏంటో ఈమె చేసుకోకుండా ఇలా చెప్పడం ఏంటి అంటూ పక్కకెళ్ళి గొనుక్కున్నారట.

ఇక చివరికి ఆయన దర్శకత్వం వహిస్తున్న సమయంలో అప్పుడు తెలిసి వచ్చిందట తేజకు ..ఒక్క లైట్ సరిగ్గా పడకపోతే దానివల్ల ఎంత ఇబ్బంది ఉంటుందో అని.. కచ్చితం అంటే శ్రీదేవికి ఆ బాధ్యత ఉండడం నిజంగా గొప్ప అలవాటు అంటూ ఆయన చెప్పుకొచ్చారు.

Share post:

Latest