పట్టాలెక్కకముందే బాలయ్య ఫిక్స్.. 108తో రయ్యిమంటూ దూసుకొచ్చేస్తున్నాడు..?

నటసింహం బాలకృష్ణ.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమాతో విపరీతమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా భారీ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకోవడమే కాదు ఎన్నో రికార్డులను సైతం బద్దలు కొట్టింది. విదేశాలలో కూడా అరుదైన రికార్డులను సృష్టించింది ఈ సినిమా. ఇకపోతే బాలయ్య అఖండ సినిమా తర్వాత అన్నీ కూడా మాస్ యాక్షన్ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉండడం గమనార్హం. ఈ క్రమంలోనే క్రాక్ మూవీ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగు ఇటీవల కర్నూల్ లో పలు ప్రాంతాలలో నిర్వహించగా అందుకు సంబంధించిన ఫోటోలు కూడా లీక్ అయ్యి సినిమాపై మరింత హైప్ ని పెంచాయని చెప్పవచ్చు.Nandamuri Balakrishna Teams Up With Director Anil Ravipudi For His 108th  Film NBK108ఈ సినిమా తర్వాత బాలయ్య బాబు ఎఫ్ 3 సినిమా డైరెక్టర్ అనిల్ రావిపూడి తో తన 108 చిత్రాన్ని తెరకెక్కించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా నటీనటులు ఎంపికలు కొంచెం ఆలస్యమైనా మొత్తం అంతా సిద్ధం అయినట్లు సమాచారం. ఇక గోపీచంద్ సినిమా పూర్తి అవ్వగానే బాలయ్య అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కించే సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నారు అని సమాచారం. ఇక అసలు విషయం ఏమిటంటే సినిమా ఇంకా పట్టాలెక్కలేదు.. అప్పుడే రిలీజ్ డేట్ ని కూడా ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న సినిమాను సమ్మర్లో విడుదల చేస్తామని అనుకుంటున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాకు పోటీగా బాలయ్య బాబు తన 108 వ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.Nandamuri Balakrishna Announces His Next Movie With F3 Filmmaker Anil  Ravipudiప్రస్తుతం ఇదే వార్త ట్రెండ్ అవుతూ ప్రేక్షకులలో మరింత ఆసక్తిని నెలకొంటుంది. ఇక ఈ రకంగా చూసుకున్నట్లయితే సమ్మర్ కానుకగా ఈ రెండు సినిమాలు గట్టి పోటీ ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రెండు చిత్రాలు కూడా మాస్, యాక్షన్ ఓరియంటెడ్ కథలే కాబట్టి ఏ సినిమా ఏ రేంజ్ లో ప్రేక్షకులను మెప్పిస్తుందో తెలియాల్సి ఉంది.

Share post:

Latest