బాల‌య్య – అనిల్ రావిపూడి ఫ‌స్టాఫ్ ఇదే…!

ఎఫ్ 3 సినిమాతో దర్శకుడు అనిల్ రావుపూడి బ్లాక్ బ‌స్టర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన దృష్టి అంతా నటసింహ బాలకృష్ణతో తీయబోయే సినిమా పైనే ఉంది. ఈ ఇరువురి కాంబోలో సినిమా ఓకే అయిన విషయం తెలిసింది. బాలకృష్ణ ఇప్పుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 107 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. గ‌త సంవత్సరం ఆఖండ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోనే తిరుగులేని హిట్ అందుకున్న బాలయ్య.

 

ఎఫ్ 3 సినిమాతో హిట్ కొట్టిన అనిల్ రావిపూడి ఇప్పుడు బాల‌య్య సినిమా కోసం స్క్రిప్ట్ చాలా పకడ్బందీగా తయారు చేస్తున్నట్లు సమాచారం. అనిల్ ఈ సినిమా స్క్రిప్ట్ పైనే ప్రధానంగా దృష్టిపెట్టారు. ప్రస్తుత సమాచారం ప్రకారం బాలయ్య సినిమాకి సంబంధించి ఫ‌స్టాఫ్ పూర్త‌య్యింద‌ట‌. దీనికి సంబంధించిన డైలాగ్ వెర్షన్ కూడా పూర్తి చేశార‌ని తెలిసింది. ఫ‌స్టాఫ్‌ను ఇప్ప‌టికే బాల‌య్య‌కు వినిపించిన అనిల్ సెకండాఫ్‌ను కూడా వచ్చేనెల ఆఖరికి పూర్తి చేస్తారట. దీంతోపాటు ఈ సినిమాలో నటీనటులు టెక్నీషియ‌న్ల‌ను కూడా ఫైనల్ చేయ‌నున్నారు.

అయితే ఈ సినిమా గురించి మరో ఆసక్తికర వార్త బయటకు వచ్చింది. అనిల్ రావిపూడి ఈ సినిమాా కోసం తన సహజ ఫార్ములాను పక్కనపెట్టి పక్క యాక్షన్ సినిమాగా తీయాలనుకుంటున్నాడు. ఇప్పటి వ‌ర‌కు అనిల్ తీసిన సినిమాలలో కామెడీకే ఎక్కువవ ప్రాధాన్యత ఇచ్చారు. ఆయన మొదటి సినిమా పటాస్ నుంచి ఇప్పటి ఎఫ్ 3వరకు తన ట్రేడ్ మార్క్ కామెడీ తోనే ప్రేక్షకులు ముందుకు వెళ్లారు. ఇప్పుడు దానికి విరుద్ధంగా బాలయ్య సినిమాతో కామెడీ జోనర్ నుండి బయటకు వస్తున్నాడు.

సినిమా అంతా బాల‌య్య మార్క్ యాక్ష‌న్‌తో ఉంటుంద‌ట‌. బాలయ్య ఏ సినిమాలోని చేయని కొత్త కథాంశంతో అనిల్ సినిమా తీయబోతున్నారట. ఈ సినిమాలోని డైలాగ్స్ … యాక్షన్ సీన్లు అభిమానులకు గూస్‌బంప్స్‌ తెచ్చే విధంగా ఉంటాయని చెబుతున్నారు.

Share post:

Latest